Nagababu: భీమవరం సభపై మెగా బ్రదర్ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఒక్కరు తప్ప అందరూ అద్భుతంగా ఫెర్మామెన్స్ చేశారంటూ..
Nagababu: కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై వరుసగా విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు (Nagababu). ఇటీవల ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు మాయం కావడం, 15వ ప్రణాళిక సంఘంలోని నిధులు..
Nagababu: కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై వరుసగా విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు (Nagababu). ఇటీవల ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు మాయం కావడం, 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించడంపై ఘాటైన వ్యాఖ్యలతో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇటీవల భీమవరం వేదికగా జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా ఘన నివాళి. భీమవరం సభలో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ అద్భుతంగా ఫెర్మామెన్స్ చేశారు. ఆ మహానటులందరికీ ఇవే నా అభినందనలు’ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), సీఎం జగన్ (CM Jagan), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు మంత్రులు రోజా, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ 30 అడుగులు అల్లూరి కాంస్య విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు.
మన్యం వీరుడు “అల్లూరి సీతారామరాజు” విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి?
ఇవి కూడా చదవండి— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,, ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు ??????
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
కాగా గతంలో జబర్దస్త్, అదిరింది వంటి కామెడీషోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు నాగబాబు. ప్రస్తుతం కొన్ని టీవీషోల్లోనూ సందడి చేస్తున్నారు. అదే సమయంలో తన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పీఏసీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆయన నిత్యం ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు, ప్రణాళిక సంఘంలోని నిధుల మళ్లింపుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై కూడా మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..