AP Crop Insurance: ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. మంగళవారం వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు వైఎస్ఆర్ పంటల బీమా కింద పరిహారాన్ని మంగళవారం జగన్ సర్కార్ చెల్లించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు వైఎస్ఆర్ పంటల బీమా కింద పరిహారాన్ని మంగళవారం జగన్ సర్కార్ చెల్లించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. 11.59లక్షల మంది రైతుల ఖాతాల్లో 1310 కోట్లను సీఎం జగన్ ఆన్లైన్ ద్వారా జమ చేస్తారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఖరీఫ్–2020 సీజన్ పంటల బీమా సొమ్మును జమ చేస్తున్నట్లు కన్నబాబు వివరించారు. రైతులపై ఎటువంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 37.25 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. ఖరీఫ్ – 2020కు సంబంధించి 15.15 లక్షల లబ్ధిదారులకు 1820.23 కోట్ల మేర బీమా మొత్తాన్ని అనౌన్స్ చేశారని, మంగళవారం ముఖ్యమంత్రి బటన్ నొక్కి 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ 1310 కోట్లు జమ చేస్తారన్నారు. మిగిలిన 3లక్షల 56 వేల 93 మందికి సంబంధించి బయోమెట్రిక్ , ఇతర సాంకేతిక సమస్యలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వారి ఖాతాల్లోనూ జూన్ మొదటి వారంలో 510.23కోట్లు జమ చేస్తామన్నారు.
డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు కింద 21 రకాల పంటలకు బీమా కల్పించామని, వాతావరణం ఆధారంగా 9 రకాల పంటలకు సంబంధించి 35.75లక్షల హెక్టార్లకు బీమా కల్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ వాటాతో పాటు వీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నోటిఫైడ్ చేసిన పంటల సాగుదారుల వివరాలను ‘ఈ పంట’ ద్వారా నమోదు చేస్తామన్నారు.
కరోనాను కట్టడికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయండి… అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్