CM KCR Review: కరోనాను కట్టడికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయండి… అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్

CM KCR Review Meeting: కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా..

CM KCR Review: కరోనాను కట్టడికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయండి... అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us

|

Updated on: May 24, 2021 | 9:25 PM

కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు. కరోనా కట్టడి,బ్లాక్ ఫంగస్ వాక్సిన్, లాక్ డౌన్ అమలు పై సోమవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని పేర్కొన్నారు. దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి వొక్కరికీ నిరాకరించకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, వారి ఆరోగ్య రక్షణలో భాగంగా లాక్ డౌన్ కఠినంగానే అమలువుతున్నది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించడం కోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది. సత్ఫలితాలనిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను నిర్వహిస్తూ వ్యాధి లక్షణాలున్నవారికి మందుల కిట్లను అందించే కార్యక్రమాన్ని కొనసాగించాలి. అదే సమయంలో కరోనా అనుమానితులకు పరీక్షలను నిరాకరించకూడదు. ఇంతవరకే పరీక్షలు నిర్వహిస్తామనే నిబంధనలు ఉండకూడదు. ప్రాథమిక వైద్య కేంద్రాల వద్దకు వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల కోసం వచ్చే వారిలో అధికశాతం అత్యంత నిరుపేదలుంటారు కాబట్టీ ఏ ఒక్కరికి కూడా పరీక్ష నిరాకరించకూడదు. ఇట్లా మందుల కిట్లను అందిస్తూ పరీక్షల సంఖ్య పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలి ” అని సిఎం స్పష్టం చేశారు.

మంగళవారం అన్ని వైద్యకేంద్రాల్లో ఇప్పుడు ఇస్తున్న కిట్ల సంఖ్యను పెంచాలని, అవసరమున్న మేరకు ఉత్పత్తిదారులతో మాట్లాడి సరఫరాను పెంచాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్సకోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. సిఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం సెక్రటరీ సిఎంవో కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, కమిషనర్లు అంజనికుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, అడీషినల్ డిజి జితెందర్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి, హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు, సిఎం వోఎస్డీ గంగాధర్, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఈ రమేష్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, కరోనా టాస్కఫోర్స్ మెంబర్లు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు,  రోనాల్డ్ రాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 5,656 మద్యం బాటిళ్లు ధ్వంసం… మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టాలంటున్న పోలీసులు

ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. ఉచిత వైద్యం అందించండి..! ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..!