AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5,656 మద్యం బాటిళ్లు ధ్వంసం… మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టాలంటున్న పోలీసులు

Liquor Bottles Seized: ఓ వైపు కరోనాతో జనం అల్లాడుతుంటే.. మరోవైపు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా మధ్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించగా భారీగా మద్యం...

5,656 మద్యం బాటిళ్లు ధ్వంసం... మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టాలంటున్న పోలీసులు
Special Enforcement Bureau
Sanjay Kasula
|

Updated on: May 24, 2021 | 7:16 PM

Share

ఓ వైపు కరోనాతో జనం అల్లాడుతుంటే.. మరోవైపు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా మధ్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దొంగ మార్గాల ద్వారా అక్రమ మద్యం రవాణా కు పాల్పడినవారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా కృష్ణా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించగా భారీగా మద్యం బాటీళ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ద్వంసం చేశారు.  ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా మద్యం అమ్మకాలు చేస్తున్నారు కొందరు వ్యాపారస్థులు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ మార్గాల ద్వారా తరలిస్తున్న 5,656 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు.

ఇలా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మచిలీపట్నం మేయర్ శ్రీమతి మోకా వెంకటేశ్వరమ్మ , మహిళా సంరక్షణ కార్యదర్శులతో కలిసి ధ్వంసం చేశారు.  మహిళా శక్తి తోనే మద్యం మహమ్మారిని సమూలంగా నియంత్రించవచ్చని SEB డైరెక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. సమాజంలో జరిగే మంచి కార్యక్రమం ఏదైనా మహిళల నుంచే శంకుస్థాపన జరుగుతుందని ఆయన అన్నారు. ఇలా మహిళల చేతుల మీదుగా మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడం సమాజానికి స్ఫూర్తిదాయకమైన సమాచారం చేరవేయడానికి అని అభిప్రాయపడ్డారు. మద్యం మహమ్మారి చేతిలో చిక్కుకున్న కుటుంబాల సంరక్షణకు మహిళలే నాంది కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ శ్రీ రమేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ సీఎం రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ , అడిషనల్ ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఏ ఆర్ అడిషనల్ ఎస్ పి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : riyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..

Yaas Cyclone Effect: ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం.. రాగల మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..