AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Virus: కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష.. కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధంపై ఆసక్తికర చర్చ..

Covid 19 Virus: కృష్ణపట్నం ఆనందయ్య మందుకు సంబంధించిన నివేదిక రాష్ట్ర ఆయుష్ కమిషన్ రాములు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌...

Covid 19 Virus: కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష.. కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధంపై ఆసక్తికర చర్చ..
Cm Ys Jagan
Shiva Prajapati
|

Updated on: May 24, 2021 | 11:31 PM

Share

Covid 19 Virus: కృష్ణపట్నం ఆనందయ్య మందుకు సంబంధించిన నివేదిక రాష్ట్ర ఆయుష్ కమిషన్ రాములు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నివేదికను అందజేశారు. ఈ నివేదికలో రాములు కీలక వివరాలు పొందుపరిచారు. కృష్ణపట్నంలో ఆనందయ్య 35 సంవత్సరాలుగా మందును ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కరోనాకు కూడా ఆయన మందు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఈ నివేదికలో ఏం పేర్కొన్నారంటే.. ‘కరోనాకు నోటి ద్వారా నాలుగు రకాల మందులు, కళ్లలో డ్రాప్స్‌ ఇలా ఐదు రకాలుగా మందులు ఇస్తున్నారు. ఈ మందు తయారీ కోసం ఆయన 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారు. అన్నీ కూడా సహజంగా దొరికే పదార్థాలు. వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదు. మందుల తయారీ విధానాన్ని మొత్తం మాకు చూపించారు. ఫార్ములా కూడా చెప్పారు.’

‘ఆ మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపాం. కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా ఈ మందు శాంపిళ్లను ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ స్టడీస్‌’ (సీసీఆర్‌ఏఎస్‌)కు పంపాం. వాళ్లు 500 మందికి ఇచ్చి వారి నుంచి పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నారు.’ అని రాములు తన నివేదికలో వెల్లడించారు. కాగా, ఈ మందుు వినియోగం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని ఈ సమీక్షా సమావేశంలో సీఎం సహా అధికారులు అభిప్రాయడ్డారు. ఆరు, ఏడు రోజుల్లో నివేదిక వస్తుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే, కంటిలో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఫలితాలు వచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉండగా.. కరోనా వైరస్ నియంత్రణ, వ్యా్క్సినేషన్‌పై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అలాగే బ్లాక్ ఫంగస్‌పైనా ఆయన సమీక్ష జరిపారు. బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి అని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంజక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. వైట్‌ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లపైనా సమాచారం వస్తోందని, వాటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకపోతే.. రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వలపైనా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. తుపాను కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే విశాఖపట్నం వెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

Also read:

Corona Recovery: కరోనా ఎఫెక్ట్.. ఈ పండ్లు తింటే శరీరంలో ఆక్సీజన్ లెవల్స్ పెరుగుతాయి..!

Hyderabad: సంక్షోభ సమయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఇకపై డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే..

Family Man 2: ముదురుతున్న వెబ్ సిరీస్ వివాదం.. ఫ్యామిలీ మ్యాన్2 పై సీరియస్ అయిన తమిళనాడు ప్రభుత్వం..