AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Man 2: ముదురుతున్న వెబ్ సిరీస్ వివాదం.. ఫ్యామిలీ మ్యాన్2 పై సీరియస్ అయిన తమిళనాడు ప్రభుత్వం..

ఒక్క వెబ్ సిరీస్ ఇప్పుడు అందరినోటా నానుతుంది. అదే ఫ్యామిలీ మ్యాన్2. సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన..

Family Man 2: ముదురుతున్న వెబ్ సిరీస్ వివాదం.. ఫ్యామిలీ మ్యాన్2 పై సీరియస్ అయిన తమిళనాడు ప్రభుత్వం..
Family Man 2
Rajeev Rayala
|

Updated on: May 24, 2021 | 10:54 PM

Share

Family Man 2: ఒక్క వెబ్ సిరీస్ ఇప్పుడు అందరినోటా నానుతుంది. అదే ఫ్యామిలీ మ్యాన్2. సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ స్ట్రీమింగ్‌లో మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి జంటగా నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మ్యాన్2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే  సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్రలో నటించింది. అయితే ఇందులో తమ ఉగ్రవాది పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక అన్ని సజావుగా ఉన్న సమయంలో సమంతకు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ట్రైలర్ చూసిన తమిళియన్స్ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆ ట్రైలర్‏లో తమిళనాడు ప్రజలను ఉగ్రవాదులుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన సమంత అలాంటి పాత్ర చేయడంతో తమిళ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ట్రైలర్ విడుదలైన కాసేపట్లోనే ట్విట్టర్ ఖాతాలో ది ఫ్యామిలీ మ్యాన్ 2కు తమిళులు వ్యతిరేకం (Family Man 2 Against Tamils) అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ – 2 వెబ్ సీరీస్ ఫై తమిళనాడు సర్కార్ సీరియస్ అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సీరీస్ ని విడుదలను నిషేధించాలి అని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కి తమిళ ప్రభుత్వం లేఖ రాసింది. తమిళుల మనోభావాలు కించపరిచేలా చిత్రీకరించిన ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సీరీస్ ఎట్టి పరిస్థితులలో అనుమతించమని లేఖలో పేర్కొంది. ఈలం పోరాటం గురించి తెలుసుకోకుండా తమిళులను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేయడం బాధాకరమని , కేంద్ర ప్రభుత్వం తక్షణమే మా విజ్ఞప్తిని స్వీకరించి ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సీరీస్ ని బ్యాన్ చేయాలనీ తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Malaika Arora : చట్టపట్టాలేసుకు తిరగడం వరకు సరే.. ఇప్పటికైనా ఈ ప్రేమ జంట పెళ్లిపై స్పందిస్తారా..