AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itlu Mee Niyojakavargam: దెందులూరు నియోజకవర్గంలో హీటెక్కుతున్న రాజకీయం.. వినిపించి వినిపించనట్లు..

ఆయన్ను విపక్షాలు లండన్ బాబు అని విమర్శిస్తాయి. అలా అంటే ఆయన విని ఊరుకుంటాడా...వెంటనే కస్సున లేచి మాటకు మాట చెల్లిస్తారు. ఇంతకీ ఈ లండన్ గోల ఏంటి..

Itlu Mee Niyojakavargam: దెందులూరు నియోజకవర్గంలో హీటెక్కుతున్న రాజకీయం.. వినిపించి వినిపించనట్లు..
Denduluru Assembly
Sanjay Kasula
|

Updated on: Jan 20, 2023 | 7:43 PM

Share

దెందులూరు నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమలోనే కాదు.. కాదు.. ఉమ్మడి ఏపిలోనే మోత మోగిన పేరు. ఎందుకంటే అక్కడ రాజకీయం మామూలు గా ఉండదు. అదేంటి గోదావరి జిల్లాల్లో అంత సపరేట్ సీన్ ఎందుకంటారా.. అదే ఆ నియోజకవర్గం ప్రత్యేకత. ఇక్కడ మిగిలిన చోట్లలా ప్రశాంతంగా ఉండదు. కనిపించి కనిపించినట్లు, వినిపించి వినిపించినట్లు తిట్టుకోవటమో విమర్శించు కోవటమో ఉండదు. అంతా బాహాయమే.. విపక్షం క్యాంపులో సైతం కోర్టులు నడపగల సమర్ధత దెందులూరు నియోజకవర్గం రాజకీయంలో ప్రత్యేకత. అందుకే ఇక్కడ మాటలు అక్కడికి అక్కడ తూటాలు ఇక్కడ బుల్లెట్ కంటే వేగంగా చేరతాయి. ఇక విమర్శలకేం కొదవుండదు.. రాత్రి పగలు తేడా కూడా ఉండదు ఈ నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ రాజకీయం పార్టీలు చేతిలో ఉండదు. కుటుంబాల చేతిలో ఉంటుంది.

ఎవరా కుటుంబాలు అంటారా.. అదిగో ఒకటి చింతమనేని రెండోది కొంటారు. ప్రస్తుతం ఈ రెండు ఫ్యామిలీ లేదే ఇక్కడ రాజకీయం. ఇదిగో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చంద్రబాబు మొదటి ఎక్కడ ప్రారంభించారో తెలుసా..  దెందులూరు లోనే.. ఎందుకంటే దెందులూరు అంతస్పెషల్. ఇక్కడ టిడిపి మాజీ యం.యల్.ఎ చింతమనేని ప్రభాకర్ ఒకపుడు ఒంటిచేత్తో ఏలిన నియోజకవర్గం. ఆమాటకు తిరుగులేదు.. చేస్తే ఎదురు లేదన్నట్లు సాగిన ప్రస్థానం.

కాని 2019లొ సిన్ రివర్స్ అయింది. విదేశాల్లో వ్యాపారం చేసుకుంటూ వచ్చిన కొంటారు అబ్బాయి చౌదరి గెలిచారు. ఇదే కాంటెస్ట్ తో మళ్లీ లండన్ పంపిస్తా నంటూ స్వయంగా చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని ఉద్ధేశించి మాట్లాడారంటే ఇక్కడ పొలిటికల్ సీన్ ఎంత హాట్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే చింతమనేనికే కాదు అబ్బాయి చౌదరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు అబ్బాయి చౌదరి.

దెందులూరు నియోజకవర్గం భౌగోళికంగా చాలా ప్రాధాన్యత గల ప్రాంతం. అటు ఉమ్మడి క్రృష్ణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాలకు సరిహద్దు లు కలిగి ఉంటుంది. కొల్లేరు సరస్సు తో పాటు మెట్టు ప్రాంతాలను కలుపుకుంటుంది. అయితే తాగునీరు సమస్యలు, వ్యవసాయ ఆధారమైన ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి రైతాంగం ఎదుర్కొంటున్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా తమ్మిలేరు లో ఇసుక మాఫియా, పోలవరంలో మట్టి మాఫియా, కొల్లేరు లో ప్రశాంతత లేని వాతావరణం ఉందని వైసిపి నేతలు ఆరోపించేవారు. అయితే కోడిపందాల నుంచి కొల్లేరు వరకు, పోలవరం మట్టి నుంచి తమ్మిలేరు ఇసుక వరకు మొత్తం దోపిడి జరుగుతుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

మీకు కళ్లల్లో నీళ్లు ఎపుడైనా వచ్చాయా…ప్రయాణం చేస్తున్నపుడు ఇంతకంటే నరకం లేదని ఎపుడైనా అనిపించిందా…అలా ఖచ్చితంగా ఏలూరు నుంచి కైకలూరు వెలుతుంటే ఎవరికైనా అని పీడిస్తుంది. ఎందుకంటే ఆ రోడ్డు అంత దారుణం గా ఉంటుంది. అయితే ఇపుడు ఆ పరిస్థితి మారిపోతుంది. నూతన రోడ్లను వేస్తున్నారు.

దెందులూరు నియోజకవర్గం రాజకీయ చేస్తున్నారు గలిగిన ప్రాంతం. సుదీర్ఘకాలం ఇక్కడ రాజకీయం చేసిన కుటుంబాలను ప్రస్తావించకపోతే, తెలుసుకో కపోతే ఈ నియోజకవర్గం ను అర్థం చేసుకోవటమూ కష్టమే… టిడిపి ఆవిర్భావం కు ముందు కాంగ్రెస్ ఏకపక్షంగా ఉండేది. అయితే టిడిపి గాలిలో ఇండిపెండెంట్ గా పోటీ చే‌సి గారపాటి సాంబశివరావు గెలిచారు. ఒక పర్యాయం గ్యాప్లో నాలుగు సార్లు అయిన యం.యల్.ఎగా గెలిచారు. ఇక ఆ తర్వాత నియోజకవర్గంపై మాజీ యం.పి మాగంటి బాబు కుటుంబం ప్రభావం చూపించింది.

మాగంటి బాబుసహా ఆయన తండ్రి, తల్లి ఇద్దరు ఎం.ఎల్.ఎలుగా గెలిచారు. వీరి తర్వాత చింతమనేని ప్రభాకర్… ఆయన రాజకీయాల్లో మండలం స్థాయి నుంచి ఎదిగారు. దూసుకుపోవటం, ప్రత్యర్థి ఎంత బలమైన వ్యక్తి అయినొ దూకుడుగా ముందుకు వెళ్లటం, నమ్మిన వ్యక్తులు..తనకు నమ్మకమైన వ్యక్తులకు కొమ్ము కాయటం… ఇలాంటి లక్షణాలతో తన ఎదుగుదలను రాసుకున్న ఆయన తన ఓటమిని సైతం అదేపంథాతో లిఖించుకున్నారు.

ఇక జనసేన నియోజకవర్గంలో ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది. మెజార్టీ జనాభా ఉన్న కాపు సామాజికవర్గం మూడు పార్టీలు గా ఇక్కడ చీలిపోయాయి. దెందులూరు నియోజకవర్గం చరిత్రలో అత్యధిక సార్లు ఒకే సామాజిక వర్గం గెలుస్తూ వస్తుంది. బి.సిలు అధికంగా ఉన్నా అటు ప్రజారాజ్యం పోటీలో ఉన్నప్పుడు, 2014లో వైసిపి బి.సి అభ్యర్థి ని నిలబెట్టినా ఇక్కడ గెలవలేని పరిస్థితి. అయితే జనసేన సైతం ఇక్కడ బరిలో ఉండి ఓట్ల చీలికతో లాభపడాలని చూస్తోంది.

ఈక్రమంలో వైసిపి,టిడిపిల మధ్య మరోసారి హోరాహోరీగా రాబోయే ఎన్నికల్లో పోటీ ఉండబోతుంది. ఇరుపార్టీలకు రాబోయే ఎన్నికలు చావో రేవో అన్నచందంగా ఉంటాయి. టిడిపి నుంచి చింతమనేని, వైసిపి నుంచి అబ్బాయి చౌదరి బరిలో ఉంటారనేది వినిపిస్తున్న మాట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం