CM Jagan: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు..

CM Jagan: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Ys Jagan
Follow us
Subhash Goud

|

Updated on: Aug 13, 2022 | 6:56 AM

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ అవసరం అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేక అధికారిని నియమించి.. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిన్న సీఎం జగన్‌ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. స్కూళ్లకు ఎలాంటి మరమ్మతులు అవసరమైనా వెంటనే బాగు చేసే విధానం ఉండాలన్నారు. స్కూళ్లకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జగన్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరినాటికే సిద్ధం చేయాలన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి క్లాస్‌లో డిజిటల్‌ బోధన:

అన్ని పాఠశాలల్లో ప్రతి తరగతి గదుల్లో డిజిటల్ బోధన కోసం టీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది ప్రక్రియ దశల వారీగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండేలా చర్యలు తీసుకోవాలని, ఎస్‌ఓపీలను రూపొందించాలన్నారు. స్కూల్స్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు స్కూల్స్‌కి కాంపౌండ్‌ వాల్స్‌ తప్పనిసరిగా ఉండాలని.. వెంటనే దృష్టి పెట్టాలన్నారు. పిల్లలకు ఇస్తున్న యూనిఫామ్‌ల విషయంలో నాణ్యతపై రాజీ పడొద్దన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌ టెండర్ల ఖరారును పూర్తి చేసి.. వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలన్నారు.

ఇవి కూడా చదవండి

పాఠ్యపుస్తకాల కొరత ఉండకూడదు:

ట్యాబుల్లో విద్యార్థుల పాఠ్యాంశాలు పూర్తిగా ఉండాలని, పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికి అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వేతర స్కూల్స్‌ బుక్స్‌ కావాలని అడిగితే.. ఇచ్చేందుకు రెడీగా ఉండాలని కోరారు. ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత ఉండకూడదని హెచ్చరించారు. బాలికల భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు. రక్షణ, భద్రత, ఆరోగ్యం వంటి అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే