Andhra Pradesh: లక్కీ భాస్కర్ అవుతాం.. గోడ దూకి పారిపోయిన నలుగురు విద్యార్థులు..
వాళ్లంతా స్కూల్ విద్యార్థులు.. హాస్టల్లో ఉంటున్నారు.. ఒక్కసారిగా ఆ నలుగురు మాయమయ్యారు. హాస్టల్ వార్డెన్ వారి గురించి ఆరా తీశారు. ఎక్కడా కనిపించలేదు.. ఇళ్లకు కాల్ చేశారు.. అక్కడికి వెళ్ళలేదు.. చివరకు హాస్టల్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేశారు.. ఆ నలుగురు విద్యార్థులు 15 అడుగులకు పైగా ఎత్తున్న మెయిన్ గేటు గోడను ఎక్కి గెంతేశారు..
వాళ్లంతా స్కూల్ విద్యార్థులు.. హాస్టల్లో ఉంటున్నారు.. ఒక్కసారిగా ఆ నలుగురు మాయమయ్యారు. హాస్టల్ వార్డెన్ వారి గురించి ఆరా తీశారు. ఎక్కడా కనిపించలేదు.. ఇళ్లకు కాల్ చేశారు.. అక్కడికి వెళ్ళలేదు.. చివరకు హాస్టల్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేశారు.. ఆ నలుగురు విద్యార్థులు 15 అడుగులకు పైగా ఎత్తున్న మెయిన్ గేటు గోడను ఎక్కి గెంతేశారు.. అక్కడ నుంచి జంప్ అయ్యారు.. కట్ చేస్తే ఆ స్టోరీలో లక్కీ భాస్కర్ మూవీ…! తెరపైకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ ఆంథోనీ బోర్డింగ్ హోమ్‌లో చాలామంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూ వసతి ఉంటున్నారు. వారిలో నలుగురు విద్యార్థులు ఈ సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆ ముందు రోజే పాత పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలోని కొండ గుడిపై జాతరకు అందరితోపాటు వెళ్లారు. గురువులు విద్యార్థులు కలిసి అక్కడ నుంచి ఆర్కే బీచ్ కి కూడా వెళ్లి సరదాగా గడిపారు. రాత్రి హాస్టల్‌కు వచ్చి పడుకున్నాక తెల్లారి మాయమైపోయారు నలుగురు విద్యార్థులు.. వారి గురించి అంతా వెతికారు నిర్వాహకులు. ఇంటికి వెళ్ళారేమో అనుకొని ఇళ్లకు కాల్ చేసి ఆరా తీశారు. అక్కడకు కూడా వెళ్లకపోయేసరికి పేరెంట్స్ తో పాటు టీచర్లు ఆందోళన చెందారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీ కెమెరాలు పరిశీలించారు. దీంతో నలుగురు విద్యార్థులు.. బ్యాగులు పట్టుకొని సోమవారం ఉదయం 6:30 ప్రాంతంలో.. 15 అడుగుల ఎత్తులో ఉన్న మెయిన్ పైకెక్కి గోడ దూకేశారు.. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయినట్టు గుర్తించారు.
కారణం అదేనా..
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అక్కడి ఉపాధ్యాయులతో పాటు స్నేహితుల నుంచి ఆరా తీశారు. దీంతో ఆ నలుగురు పారిపోయిన విద్యార్థులు చాలా తెలివైన వారిని.. చదువులో కూడా రాణిస్తున్నారని తెలిసింది. అసలు కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తే.. కీలక విషయం తెలిసింది. వారిలో కొంతమంది ఈ మధ్యకాలంలో లక్కీ భాస్కర్ సినిమా స్టోరీ తెలుసుకొని.. దానికి ప్రభావితులయ్యారు. ఒక్కొక్కరూ మాట్లాడుకుని నలుగురు ఒక్కచోట చేరారు. లక్కీ భాస్కర్ మాదిరిగానే డబ్బు సంపాదించాలి అనుకున్నారు. కారు, బంగ్లా, బంగారం అంటూ పెద్దపెద్ద కలలు కన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదిద్దామని అనుకున్నారు. నలుగురు ఒక మాట పైకి వచ్చి బ్యాగులు సర్దుకొని హాస్టల్ నుంచి గోడ దూకి పారిపోయారు అని పోలీసులు అంటున్నారు. ప్రత్యేక బృందలుగా రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థుల పోస్టర్లను అతికించారు. సమాచారం తెలిస్తే చెప్పాలని సూచించారు.
హైదరాబాద్‌కి వెళ్లాలని అనుకునేవారు..
అయితే, హాస్టల్ వార్డెన్ జయరాజ్ తమదైన శైలిలో విద్యార్థులతో మాట్లాడారు. పారిపోయిన నలుగురులో ఒకరి బంధువులు హైదరాబాదులో ఉంటున్నారని.. ఎలాగైనా అంకుల్ ఇంటికి వెళ్లాలని అందులో ఉన్న విద్యార్థి తరచూ మిగిలిన విద్యార్థులతో అనేవాడన్న విషయం తమకు తెలిసిందని అంటున్నారు వార్డెన్ జయరాజ్.
లక్కీ భాస్కర్ సరే.. మరి ఆ డైలాగ్ మర్చిపోయారా..
లక్కీ భాస్కర్ మూవీ చూసి ప్రభావితమయ్యారు అంటున్న విద్యార్థులు.. మరి అందులో మరో డైలాగ్ కూడా ఉంది. ‘వేగంగా వెళ్లే బండి.. వేగంగా వచ్చే రూపాయి.. ఎప్పుడో ఒకసారి పడిపోవాల్సిందే..!’ అన్న డైలాగు ఎందుకు మర్చిపోయారు. నిజంగా ఆ సినిమాపై ప్రభావితమైతే ఈ డైలాగును కూడా సరిగా విని ప్రభావితం అయితే అలా ఆలోచించరేమో అనుకుంటున్నారు జనం.
విజయవాడలో విద్యార్థులు..
విశాఖ హాస్టల్ నుంచి పారిపోయిన నలుగురు విద్యార్థులు విజయవాడలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని తిరిగి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..