Andhra Pradesh: మధ్యాహ్నం ఒంటిగంట.. పుస్తకాలను తలగడగా పెట్టుకుని హాయిగా బజ్జున్నారు.. కట్ చేస్తే..

రంగు రంగుల బెంచ్‌ల మధ్యలో ఒకాయన హాయిగా నిద్రపోతున్నారు. బెంచ్‌ల మధ్యలో పడుకున్న ఆయన తలకింద ఏకంగా పుస్తకాల కట్ట ఉంది.. ఆయన తలగడగా దానిని పెట్టుకున్నారు. పక్కనే మంచినీళ్ల బాటిల్ కూడా ఉంది. అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఒక స్కూల్లోని తరగతి గది అని అర్ధమవుతోంది.

Andhra Pradesh: మధ్యాహ్నం ఒంటిగంట.. పుస్తకాలను తలగడగా పెట్టుకుని హాయిగా బజ్జున్నారు.. కట్ చేస్తే..
Teacher Sleep In School
Follow us
T Nagaraju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 11, 2024 | 6:04 PM

రంగు రంగుల బెంచ్‌ల మధ్యలో ఒకాయన హాయిగా నిద్రపోతున్నారు. బెంచ్‌ల మధ్యలో పడుకున్న ఆయన తలకింద ఏకంగా పుస్తకాల కట్ట ఉంది.. ఆయన తలగడగా దానిని పెట్టుకున్నారు. పక్కనే మంచినీళ్ల బాటిల్ కూడా ఉంది. అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఒక స్కూల్లోని తరగతి గది అని అర్ధమవుతోంది. అయితే నిద్రపోతున్నది మాష్టారే.. అని మీకు అనుమానం వచ్చింది కదా.. అవును నిజమే.. మీ అనుమానం వాస్తవమే.. నిద్రపోతుంది మాష్టారే.. ఆ ఉపాధ్యాయుడి పేరు పేరు కేవీ నారాయణ.. స్కూలు పాతమల్లాయపాలెంలోని ప్రాథమిక పాఠశాల.. మధ్యాహ్నం 1.40 నిమిషాలైంది. మాష్టారు ఏకంగా నిద్రకు ఉపక్రమించేశారు. అయితే విద్యార్ధులు ఏమయ్యారనేగా మీ డౌట్.. వాళ్లు అడ్డుకున్నారేమో మరి.. నారాయణ మాష్టారు వారందరిని పక్కనే ఉన్న అంగన్ వాడీ సెంటర్ కు పంపించారు. ఆ తర్వాత హాయిగా బజ్జున్నారు.. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన నిద్రపోతున్న ఫోటోలు ఏకంగా గుంటూరు డిఈవోకు వాట్సప్ లో వచ్చాయి. వెంటనే ఆమె ఎంఈవోలను విచారణకు ఆదేశించారు. ఎంఈవోలు రమాదేవి, లీలా రాణి విచారణకు వెళ్లారు. అందరి స్టేట్ మెంట్స్ రికార్డు చేసి నివేదికను డీఈవోకు పంపారు.

అయితే, ఇది ఏకోపాధ్యాయ పాఠశాల అని ఇందులో పదమూడు మంది విద్యార్దులున్నారని ఎంఈవోలు చెప్పారు. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే విద్యార్ధులను అంగన్ వాడీ సెంటర్ కు పంపించి తాను నిద్రపోయినట్లు నారాయణ మాష్టారు వివరణ ఇచ్చుకున్నారు.

అయితే ఆరోగ్యం సరిగాలేకుంటే ముందే సమాచారం ఇచ్చి ఉంటే వేరొక మాష్టారును పంపించేవారమని ఎంఈవోలు మాస్టారుకు చెప్పారు. దీంతో ఈ అంశంపై సరిగా వివరణ ఇచ్చుకోలేకపోయారు మాస్టారు.. అయితే.. ఎంఈవోల నివేదిక అందిన వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈవో రేణుక చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..