Chandrababu: పోటీపడండి.. హార్డ్ వర్క్‌ కాదు స్మార్ట్‌ వర్క్‌ చేయండి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

కొన్ని సూచనలు.. ఇంకొన్ని సలహాలు.. మరికొన్ని బాధ్యతలు గుర్తుచేస్తూ మొదటి రోజు కొనసాగింది సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. హార్డ్ వర్క్‌ కాదూ.. స్మార్ట్‌గా దూసుకుపోవాలని ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం..

Chandrababu: పోటీపడండి.. హార్డ్ వర్క్‌ కాదు స్మార్ట్‌ వర్క్‌ చేయండి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
Chandrababu Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2024 | 5:40 PM

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, బియ్యం మాఫియా పెరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇకపై ఏ జిల్లాలో అయినా బియ్యం, గంజాయ్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు.. సీఎం చంద్రబాబు ఆదేశించారు.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని.. ఇందుకోసం ప్రతి ఒక్క అధికారి సీరియస్ గా పని చేయాలని చంద్రబాబు సూచించారు.. రెండు రోజులపాటు నిర్వహించే కలెక్టర్లు, ఎస్పీల సదస్సును బుధవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కొన్ని సూచనలు.. ఇంకొన్ని సలహాలు.. మరికొన్ని బాధ్యతలు గుర్తుచేస్తూ కలెక్టర్లతో మొదటిరోజు భేటీ కొనసాగింది.

హార్డ్ వర్క్‌ కాదూ.. స్మార్ట్‌గా దూసుకుపోవాలని ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం చంద్రబాబు.. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడినట్టే.. అభివృద్ధిలో జిల్లాల కలెక్టర్లు పోటీపడాలన్నారు. అభివృద్ధితో సంపద వస్తుందని.. అదే సంపదతో అభివృద్ధి సాధ్యమవుతుదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని.. వాటిని వెతుక్కోవడమే నాయకత్వమన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలు, విజన్ 2047పై కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

విజన్‌-2047 సాధన కోసం 20కి పైగా పాలసీలు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రస్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ అమలు కావాలన్నారు. 20లక్షల మందికి ఉద్యోగాలివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరోవైపు జిల్లాల్లో రేషన్‌, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాలని కలెక్టర్లను ఆదేశించారు చంద్రబాబు. 2027కల్లా పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇటీవల ఐటీ మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా విశాఖలో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని.. దీంతో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. గత ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేషన్‌ పాత్రే లేదన్నారు. రివ్యూ చేస్తున్న క్రమంలో ఎన్నో ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అక్రమాలు, అన్యాయాలు అని తెలిసినా ఏ ఒక్క అధికారి అభ్యంతరం చెప్పలేదని.. ఈ విధానం సరికాదన్నారు. బియ్యం స్మగ్లింగ్ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..