indian Army Camp : ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మూడు రోజుల పాటు ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ …
ఆంధ్ర- కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతం లో భారత్ ఆర్మీ జవాన్లు సైనిక విన్యాసాలు చేపట్టారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దొనేకల్ వద్ద ఏపీ కర్నాటక రాష్ట్ర సరిహద్దు పొలాల్లో..
indian Army Camp : ఆంధ్ర- కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతం లో భారత్ ఆర్మీ జవాన్లు సైనిక విన్యాసాలు చేపట్టారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దొనేకల్ వద్ద ఏపీ కర్నాటక రాష్ట్ర సరిహద్దు పొలాల్లో భారత్ ఆర్మీకి చెందిన జవాన్లు విమానాల నుంచి స్కై డైవింగ్, పారా జంపింగ్ విన్యాసాలు నిర్వహించారు.
ఆర్మీ ట్రైనింగ్ లో భాగంగా లో సైనికులకు ప్రత్యేకంగా వందల అడుగుల ఎత్తులో విమానంలో నుండి కిందకు దూకి ప్యారచుట్ సహాయంతో సైనికులు కిందికి దిగారు. ఇందుకోసం సైనికులకు ప్రత్యేక ఫుడ్ కోర్టు ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు.
ప్రతి యేటా ఈ ప్రాంతంలో ఆర్మీ .ఈ కార్య క్రమం నిర్వహిస్తున్నారు. మార్చి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు…మూడు రోజుల పాటు ఈ ట్రైనింగ్ క్యాంప్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సైనిక విన్యాసాలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
Also Read: ఓ మై గాడ్.. క్రెడిట్ కార్డు వాడకం.. కొకైన్‌కి బానిసవ్వడం ఒక్కటేనట.. షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న..