AP News: మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి సాక్ష్యం ఇదే..

ఈరోజుల్లో మనవత్వం అనేది లేదని..అది ఎప్పుడో చచ్చిపోయిందని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన ఇంకా మనవత్వం బతికే ఉంది అని ప్రూవ్ చేసింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? అసలు జరిగిందేంటి?

AP News: మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి సాక్ష్యం ఇదే..
Artificial Leg To Cow
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 30, 2024 | 11:07 AM

చెట్లు నరికి వేయటంతో కోతులు, కొండముచ్చులు తరుచుగా గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చి హల్చల్ చేయటం మనం చూస్తుంటాం.. కానీ వాటికి అలాంటి పరిస్థతి ఎందుకు వచ్చిందని అలోచించి సహాయం చేసే వారు మాత్రం అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి సంఘటనే ఒక్కటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. కాలుపోయిన ఓ ఆవును భారం అనుకోకుండా ఓ వ్యక్తి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును ఆసుపత్రి వైద్యులు అమర్చడంతో ఇప్పుడు ఆ ఆవు తన సాదారణ జీవితం గడుపుతుంది. మోపిదేవి మండలం కె కొత్తపాలెం గ్రామానికి చెందిన ఏం  శ్రీనివాసరావు కాలు లేని ఒక ఆవును చూసి దాన్ని ఆటోలో ఎక్కించుకుని పాలకొల్లులోని చైతన్య కృత్రిమ అవయవాల కేంద్రానికి తీసుకువచ్చారు. ఇక్కడ వేదాంతం సదాశివ మూర్తి మనుషులకు కృత్రిమ అవయవాలు అమరుస్తుంటారు. సదాశివమూర్తి ఆవుకు కృత్రిమ కాలును అమర్చేందుకు అంగీకరించారు. ఉచితంగానే  ఆయన ఆవుకు కృత్రిమ కాలును అమర్చాడు

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి