Cyclone Michaung: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు తుఫాన్‌గా మారనున్నట్లు వెల్లడించారు. 5వ తేదీ నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు తుఫాన్‌గా మారనున్నట్లు వెల్లడించారు. 5వ తేదీ నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతికి వాతావరణ శాఖ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఏపీ, తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఆదివారం మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడుకు కూడా ముంపు పొంచి ఉంది. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తొమ్మిది నౌకాశ్రయాల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కంట్రోల్ రూం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే ఏపీలోని తీరప్రాంతాల జిల్ల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలతోపాటూ ముంపు ప్రాంతానికి సంబంధించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాగల మూడు రోజులు కీలకం అని తెలిపారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది తుఫాన్ హెచ్చరికల కేంద్రం. శనివారం ఉదయం నుంచి మత్యకారులు వేటకు వెళ్లవద్దని తెలిపారు ప్రభుత్వ అధికారులు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని వారికి అవసరమైన ఆహార పదార్థాలు, నిత్యవసర సరుకులను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




