Tirumala: కష్టం వచ్చినప్పుడు శ్రీవారికి మొక్కుకున్నా: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు..
కష్టం వచ్చినప్పుడు తాను స్వామివారికి మొక్కుకుంటానన్నారు చంద్రబాబు. ధర్మాన్ని కాపాడమని, ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 01, 2023 04:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos