Viral: వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో.. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు.!

Viral: వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో.. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు.!

Anil kumar poka

|

Updated on: Dec 01, 2023 | 5:59 PM

వివాహం అంటేనే మరో కొత్త జీవితానికి నాంది పలకడం. వివాహంతో ఒక్కటైన నవజంట కొత్త జీవితాన్ని గడపడం కోసం వధువు తల్లిదండ్రులు లాంఛనాల రూపంలో అవసరమైన వస్తుసామగ్రిని సమకూర్చుతారు. అవన్నీ వివాహమై వధువును అత్తవారింటికి పంపే సమయంలో ఆమెతోపాటే పంపిస్తారు. అంతకన్నా ముందు నవ జంటకు ఏం వస్తువులు పెట్టారో అందరికీ తెలిసే విధంగా వేదికపై ప్రదర్శిస్తారు. తాజాగా ఓ నవ వధువుకు పుట్టింటివారు పెట్టిన లాంఛనాలకు..

వివాహం అంటేనే మరో కొత్త జీవితానికి నాంది పలకడం. వివాహంతో ఒక్కటైన నవజంట కొత్త జీవితాన్ని గడపడం కోసం వధువు తల్లిదండ్రులు లాంఛనాల రూపంలో అవసరమైన వస్తుసామగ్రిని సమకూర్చుతారు. అవన్నీ వివాహమై వధువును అత్తవారింటికి పంపే సమయంలో ఆమెతోపాటే పంపిస్తారు. అంతకన్నా ముందు నవ జంటకు ఏం వస్తువులు పెట్టారో అందరికీ తెలిసే విధంగా వేదికపై ప్రదర్శిస్తారు. తాజాగా ఓ నవ వధువుకు పుట్టింటివారు పెట్టిన లాంఛనాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారు నుంచి వంట సామగ్రి వరకు కానుకలను ప్రదర్శించారు. పెళ్లి బహుమతులకు సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కట్నకానుకలా? లేక బజారా? అంటూ నెటిజన్లు నోరెళ్ల బెట్టారు.

ఒక జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారీగా కట్నకానుకలతోపాటు పెళ్లి బహుమతులకు సంబంధించిన వస్తువులను వివాహ వేదిక వద్ద ఉన్న గ్రౌండ్‌లో ప్రదర్శించారు. ఎస్‌యూవీ కారు మొదలు.. వరుసగా ఉంచిన కిచెన్ పరికరాలు, ఫర్నిచర్ సహా వందల సంఖ్యలో వస్తువులు ఉన్నాయి. ఫుడ్ ప్లేట్లు, కంటైనర్లు, ఫ్రైయింగ్ పాన్‌లు, రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మెషీన్, కప్‌బోర్డ్‌లు, బెడ్‌లు, సోఫాలు, అలంకారానికి సంబంధించిన అనేక వస్తువులను ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ప్రదర్శించిన కట్నకానుకలను చూసి కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెళ్లి బహుమతులా? లేక బజారా? అని మరికొందరు ప్రశ్నించారు. అయితే ఆడంబరం కోసం వీటిని ఇలా ప్రదర్శించడాన్ని కొందరు తప్పుబట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.