Uttarkashi Tunnel: సొరంగం నుంచి తిరిగివచ్చిన కొడుకును చూడకుండానే తండ్రి మృతి.
ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా టన్నెల్‌లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా దుమారియా బ్లాక్‌కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు.
ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా టన్నెల్‌లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా దుమారియా బ్లాక్‌కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు. భక్తు ముర్ము 17 రోజుల అనంతరం సొరంగం నుండి బయటకు వచ్చి, తన తండ్రి మరణవార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. ఈ సందర్భంగా బర్సా ముర్ము కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలిసి, ఇంటిలోని మంచం మీద కూర్చున్నాడని, ఇంతలోనే అకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడని తెలిపారు. బర్సా ముర్ము అల్లుడు మాట్లాడుతూ.. భక్తు ముర్ము సొరంగంలో చిక్కుకున్నాడనే సమాచారం అందిన తర్వాత అతని తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యారనీ అన్నారు. భక్తు ముర్ము సోదరుడు రాంరాయ్ ముర్ము చెన్నైలో ఉంటాడనీ, మరో సోదరుడు మంగళ్ ముర్ము కూలి పనులు చేస్తుంటాడని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

