MS.Dhoni: టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన మిస్టర్‌ కూల్‌ ధోనీ.. వీడియో వైరల్‌.

MS.Dhoni: టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన మిస్టర్‌ కూల్‌ ధోనీ.. వీడియో వైరల్‌.

Anil kumar poka

|

Updated on: Dec 01, 2023 | 6:15 PM

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ నిజంగా సింప్లీ సూపర్బ్. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ధోనీ కనిపిస్తే చాలు ఆయన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్‌, షేక్‌ హ్యాండ్స్‌, సెల్ఫీలకు ఎగబడుతుంటారు ఫ్యాన్స్‌. అందుకే ఆయనకు సంబంధించిన ఏ చిన్న వీడియో అయినా సరే ఇట్టే నెట్టింట వైరల్‌ అయిపోతుంది.

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ నిజంగా సింప్లీ సూపర్బ్. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ధోనీ కనిపిస్తే చాలు ఆయన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్‌, షేక్‌ హ్యాండ్స్‌, సెల్ఫీలకు ఎగబడుతుంటారు ఫ్యాన్స్‌. అందుకే ఆయనకు సంబంధించిన ఏ చిన్న వీడియో అయినా సరే ఇట్టే నెట్టింట వైరల్‌ అయిపోతుంది. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఓ చోట మిస్టర్‌ కూల్‌ను చూసిన అభిమాని ఒకరు ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో తన బైక్‌పై ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలంటూ ధోనీని కోరారు. ఫ్యాన్ కోరిక మేరకు ధోనీ బైక్ ముందు భాగంలో సంతకం చేసేందుకు సిద్ధమయ్యారు.

కానీ.. బైక్ మీద మరకలు కనిపించడంతో తన టీషర్టుతో స్వయంగా దానిని శుభ్రం చేసి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు. అనంతరం బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫ్యాన్‌ను ఖుషీ చేశారు. అంతేకాదు, ఆ బైక్‌పై కూర్చొని దాని విశేషాలను కూడా అడిగి తెలుసుకున్నారు ధోనీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ధోనీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. స్వయంగా తన టీషర్టుతో అభిమానికి చెందిన బైక్ తుడిచి సంతకం చేయడాన్ని కొనియాడుతున్నారు. మరికొందరైతే.. కేవలం ఒక్క టీషర్ట్‌.. ఆ బైక్‌ ఖరీదును పెంచేసింది.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ధోనీకి బైక్స్‌, కార్లు అంటే మహా ఇష్టం అన్న విషయం తెలిసిందే. తన గ్యారేజీలో లెక్కలేనన్ని ఖరీదైన బైక్స్‌, కార్లు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం, రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టడం చేస్తుంటారు. తాజాగా ధోనీ ఓ బెంజ్‌ కారులో కూడా అభిమానులకు దర్శనమిచ్చాడు. ఆ వీడియో కూడా నెట్టింట ప్రస్తుతం వైరల్‌ అవుతూ.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.