Kakinada: చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది మత్స్యకారులు.

Kakinada: చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది మత్స్యకారులు.

Anil kumar poka

|

Updated on: Dec 01, 2023 | 8:16 PM

కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటు నడి సంద్రంలో ఉండగా మంటలు చెలరేగాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. సమీపంలోనే రిలయన్స్‌ గ్యాస్‌ టవర్‌ సెక్యూరిటీ పహారా కాస్తున్నారు. సముద్రంలో మంటలు గమనించిన రిలయన్స్‌ గ్యాస్‌ సెక్యూరిటీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి మత్స్యకారులను కాపాడారు. భైరవపాలెం, కాకినాడ మధ్య తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటు నడి సంద్రంలో ఉండగా మంటలు చెలరేగాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. సమీపంలోనే రిలయన్స్‌ గ్యాస్‌ టవర్‌ సెక్యూరిటీ పహారా కాస్తున్నారు. సముద్రంలో మంటలు గమనించిన రిలయన్స్‌ గ్యాస్‌ సెక్యూరిటీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి మత్స్యకారులను కాపాడారు. భైరవపాలెం, కాకినాడ మధ్య తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లే సమయంలో భోజన అవసరాల కోసం నిత్యావసరాలు, గ్యాస్‌ సిలిండర్‌ తదితర వస్తువులను వెంట తీసుకెళ్తుంటారు. వేటకు విరామం ఇచ్చే సమయంలో బోటులో వంట చేసుకుని భోజనం చేస్తారు. ఎప్పటిలాగే అలా వెళ్లిన 11 మంది మత్స్యకారులు తిరిగి వస్తుండగా బోటులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. రిలయన్స్‌ సెక్యూరిటీ సిబ్బంది గమనించి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే మత్స్యకారులు మంటల్లో చిక్కుకోవడమో.. లేక వాటి తీవ్రతకు సముద్రంలో దూకి ప్రాణాలు కోల్పోవడమో జరిగేదని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.