AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ఛలో విశాఖ.. ముహూర్తం ఖరారయినట్లే..! సీఎం గృహ ప్రవేశం ఎప్పుడంటే..

ఛలో విశాఖ... తాజా ముహూర్తం డిసెంబర్ 8. సాగర తీరం నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో నవ శకం అంటూ.. సీఎం జగన్ ప్రతిపాదించిన మిషన్ విశాఖ.. అతి త్వరలో సాకారం కాబోతోంది. అన్నీ సక్రమంగా జరిగితే మరో వారం రోజుల్లో... అంటే డిసెంబర్ 8న జగన్ విశాఖ పయనం, అక్కడ గృహప్రవేశం... ఖాయంగా కనిపిస్తోంది. అటు.. అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తోంది.. టూరిజం శాఖ.

YS Jagan: ఛలో విశాఖ.. ముహూర్తం ఖరారయినట్లే..! సీఎం గృహ ప్రవేశం ఎప్పుడంటే..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2023 | 5:46 PM

Share

సీఎం రాక కోసం విశాఖ నగరం సిద్ధం అనే వార్తలు ఎప్పటికప్పుడు కొత్తగానే వినిపిస్తున్నాయి. మిషన్ విశాఖ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. విజయదశమికి ఖచ్చితంగా వచ్చుడే అంటూ సీఎం పేషీ నుంచి స్పష్టమైన ప్రకటన కూడా వచ్చింది. ముఖ్యమంత్రి కూడా సమాయత్తత ప్రకటించారు. కానీ.. తగిన రీతిలో ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో దశమి ముహూర్తం కూడా వాయిదా పడింది. విశాఖలో సీఎం క్యాంపాఫీసు నిర్మాణం అనే ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటై.. యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఉత్తరాంధ్ర సమతుల్య అభివృద్ధి కోసం తరచూ విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఉండవచ్చని, ఆయనతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు వైజాగ్ తీరంలో బస చేయాల్సి ఉంటుందని.. ఆ దిశగా కమిటీ కసరత్తు చేస్తోందని తాడేపల్లి నుంచి వార్తలొచ్చాయి.

ఇటీవల అక్టోబర్‌1న మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి కూడా ఛలో విశాఖపై క్లారిటీ ఇచ్చారు. విశాఖ టైప్‌2 సిటీ కనుక.. జరగాల్సినంతగా అభివృద్ధి జరగడం లేదని, తాను విశాఖకు వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు సీఎం జగన్. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో విశాఖ క్యాంప్ ఆఫీసు గృహప్రవేశం వాయిదా పడుతూ వచ్చింది. ఇటు.. టూరిజం భవనాల మీద వివాదం మొదలైంది. రుషికొండ మీద భవనాలు నిర్మిస్తోంది టూరిజం శాఖ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ… సీఎం నివాసం కోసం ఐదు ప్రాంతాల్ని సిఫార్సు చేసింది. భద్రతాపరంగా, నివాస యోగ్యత కలిగిన ప్రాంతంగా రుషికొండ అన్నిటికంటే బెటరని సూచించింది. టూరిజం శాఖక్కూడా ఈ మేరకు లేఖ రాసింది. సూత్రప్రాయంగా అంగీకారం లభించింది.. జీవో రిలీజ్ కావడం ఒక్కటే మిగిలింది.

అటు.. సీఎం క్యాంపాఫీసు నిర్మాణ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఇంటీరియర్ వర్క్ ముగిసి… రెడీమేడ్ ఫర్నిచర్ బిగించడాన్ని వర్కవుట్ చేస్తున్నారు. ఒక్కసారి డేట్ ఫిక్స్ అయితే సీఎం నివాసం సంపూర్ణం అవుతుందంటోంది నిర్మాణ సంస్థ. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ 8 లేదా 9న సీఎం గృహప్రవేశం చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి. రేపోమాపో అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..