Donkey Slaughter: ఇలానే చేస్తే జూలో చూడాల్సి వస్తుంది.. ఏపీలో గాడిదల వధలపై పెటా ఆందోళన..

దేశంలో గాడిద వధలపై ఆందోళన వ్యక్తం చేశారు పెటా ప్రతినిధులు.. 2019 నుంచి ఇప్పటి వరకు 61శాతం గాడిదలు తగ్గిపోయానని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిదల వధను అరికట్టి.. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Donkey Slaughter: ఇలానే చేస్తే జూలో చూడాల్సి వస్తుంది.. ఏపీలో గాడిదల వధలపై పెటా ఆందోళన..
Donkey Meat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2022 | 8:54 AM

ఆంధ్రప్రదేశ్ లో భారీగా గాడిద మాంసం పట్టుబడడంపై పెటా ఇండియా, ఏపీ ఎన్జీవో సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్రమంగా గాడిద వధను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారి చర్యల వల్ల దేశంలో రోజురోజుకీ గాడిదల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీఓలతో కలిసి రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో ఇన్వేస్ట్‌గేషన్ చేసినట్లు పెటా ప్రతినిధులు చెప్పారు. ఎక్కడ కూడా గాడిద వధలకు అనుమతి లేదని చెప్పారు. స్వేచ్ఛగా జీవించాల్సిన జంతువులను వధించి మాంసం అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా లక్షా 80 వేల గాడిదలు ఉంటే.. ఇప్పుడు 61 శాతం తగ్గిపోయాయని చెప్పారు. ఇలానే గాడిద వధలు కంటిన్యూ అయితే దేశంలో గాడిద జాతి అంతరించి పోతుందని చెప్పారు పెటా ప్రతినిధులు. ప్యూచర్ లో జూ లోనూ గాడిద పెట్టుకొని ఇది గాడిద అని చుపించుకునే దుస్థితి వస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో 400 కిలోల గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. అదే సమయంలో నిందితులు కిలో మాంసాన్ని రూ.600కు విక్రయిస్తున్నారని పోలీసు అధికారులు గుర్తించారు. ఎవరైనా గాడిద వధలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో గాడిద మాంసం వల్ల వెన్నునొప్పి, ఆస్తమా నయం అవుతుందనే నమ్మకం ఉందని, లైంగిక శక్తిని పెంచేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఇదే క్రమంలోనే గాడిద వధలు జరుగుతున్నాయని పోలీసులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!