Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇద్దరిదీ ఒకే ఊరు.. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం.. చివరకు భర్త ఏం చేశాడంటే..?

చుట్టుపక్కల వారి చెప్పుడు మాటలు విన్నాడు.. అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే పెనుభూతమే పీడించింది.. చివరకు భార్యపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు. అడ్డుకోబోయిన వారిని సైతం బెదిరించాడు. అనంతరం అక్కడ నుండి బైక్ పై చెక్కేశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో సంచలనంగా మారింది.

Andhra: ఇద్దరిదీ ఒకే ఊరు.. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం.. చివరకు భర్త ఏం చేశాడంటే..?
Crime News
Follow us
T Nagaraju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 10, 2025 | 1:39 PM

చుట్టుపక్కల వారి చెప్పుడు మాటలు విన్నాడు.. అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే పెనుభూతమే పీడించింది.. చివరకు భార్యపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు. అడ్డుకోబోయిన వారిని సైతం బెదిరించాడు. అనంతరం అక్కడ నుండి బైక్ పై చెక్కేశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో సంచలనంగా మారింది. బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెంకు చెందిన హారీష్, సుభాషిణిలకు 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా కాపురంలో కలహాలు మొదలయ్యాయి. తరుచూ గొడవపడుతుండేవారు. హరీష్ బందువులు సుభాషిణి ప్రవర్తన గురించి లేనిపోని మాటలు చెప్పారు. దీంతో ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. అయితే సుభాషిణిది కూడా అదే గ్రామం కావడంతో ఆమె బంధువులు వచ్చి ఆమెను పుట్టింటింకి తీసుకెళ్తామని చెప్పారు. అయితే తనకు ఎటువంటి అనుమానం లేదని చెప్పాడు.

దీంతో హారీష్ మాటలు నమ్మిన సుభాషిణి బంధువులు ఆమెను భర్త ఇంట్లోనే ఉంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే.. అనుమానం మరింత ముదిరి.. ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు.. సోమవారం మధ్యాహ్నం పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి బైక్ లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే సుభాషిణిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆమె ఒక్కసారిగా కేకలు వేసుకుంటూ బయటకు పరుగెత్తింది. తనను రక్షించాలంటూ వేడుకుంది. అయితే మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన వారిని కూడా హారీష్ బెదిరించాడు. ఆమె మంటల్లో కాలిపోతుండటాన్ని చూసిన తర్వాతే అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఈ క్రమంలోనే.. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తీసుకెళ్లాని సలహా ఇచ్చారు. అక్కడ నుండి గుంటూరు తరలిస్తు్ండగా ఆమె చనిపోయిది. ఇద్దరూ పిల్లలు తల్లిలేని బిడ్డలుగా మిగిలిపోయారు. హారీష్ ను కఠినంగా శిక్షించాలంటూ సుభాషిణీ బంధువులు బాపట్లలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..