Andhra Pradesh: ఆంధ్రా ఊటీకి పర్యాటకుల తాకిడి.. హోటల్స్ అన్నీ హౌజ్‌ఫుల్..!
హోటల్ గదులన్నీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కూల్ క్లైమేట్ లో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. చాపరాయి, బొర్రా గుహాలు, గిరిజన మ్యూజియం పద్మాపురం గార్డెన్స్, వ్యూ పాయింట్స్,వాటర్ ఫాల్స్ పర్యాటకుల సందడి నెలకొంది.
ఆంధ్ర ఊటీకి దసరా హాలిడేస్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. మన్యంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. అందాల అరకులోయలో పర్యాటకుల సందడి కొనసాగుతోంది. దసరా హాలిడేస్ తో పాటు వీకెండ్ కావడంతో అరకులోయలో పర్యాటకుల తాకిఇ పెరిగింది. హోటల్ గదులన్నీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కూల్ క్లైమేట్ లో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. చాపరాయి, బొర్రా గుహాలు, గిరిజన మ్యూజియం పద్మాపురం గార్డెన్స్, వ్యూ పాయింట్స్,వాటర్ ఫాల్స్ పర్యాటకుల సందడి నెలకొంది.
దసరా సెలవులకు దక్షిణ మధ్య రైల్వే అరకుకు ప్రత్యేక రైలు నడపడంతో పర్యాటకులు మరింత పెరిగారు. సెలవులకు తోడు అరకులోయలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం వేళలో మంచు కురుస్తూ పర్యాటకులను మరింత ఆకర్షిస్తున్నాయి. శని, ఆదివారాలలో అద్దె గదులు దొరకక టూరిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కసారిగా పర్యాటకులు పెరగడంతో అరకులోయలో సందడి వాతావరణం నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి