Dussehra: విజయవాడ దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ
కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి ఎరుపు, నీలం రంగు చీరలో ఓంకార రూపిణి అయిన అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దరసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులను కటాక్షించనున్నారు. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. దుర్గమ్మను కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.
కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి ఎరుపు, నీలం రంగు చీరలో ఓంకార రూపిణి అయిన అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః’ అనే మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా అమ్మవారికి పులిహోర సమర్పించాలని అర్చకులు చెబుతున్నారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. బంగారు రంగు చామంతులతో అమ్మను పూజించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..