AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devaragattu: దేవగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం.. ఈ ఏడాది హింసని తగ్గించేందుకు రంగంలోకి దిగిన ఎస్పీ..

మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జరుపుకునే ఉత్సవమే సమరమే కర్రల సమరం బన్నీ ఉత్సవం గ పిలుస్తారు. ఈ కర్రల సంబరానికి కొంతమంది మద్యం సేవించి వస్తుండటంతో కర్రలు తిప్ప లేక,.. కర్రల చివర్లో ఉండే ఇనుప చివ్వలు తగిలి తలలు పగులుతున్నాయి.

Devaragattu: దేవగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం.. ఈ ఏడాది హింసని తగ్గించేందుకు రంగంలోకి దిగిన ఎస్పీ..
Banni Festival
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Oct 05, 2024 | 8:33 PM

Share

దసరా పండుగ సందర్భంగా దేవరగట్టు కర్రల సంబరానికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఆలూరు నియోజకవర్గం లోని దేవరగట్టులో ప్రత్యేక విజయదశమి పండుగ రోజు మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా జరిగే సంప్రదాయ సమరమే కర్రల సమరం. దీనినే స్థానికంగా బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవానికి ఆంధ్రతో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జరుపుకునే ఉత్సవమే సమరమే కర్రల సమరం బన్నీ ఉత్సవం గా  పిలుస్తారు. ఈ కర్రల సంబరానికి కొంతమంది మద్యం సేవించి వస్తుండటంతో కర్రలు తిప్ప లేక,.. కర్రల చివర్లో ఉండే ఇనుప చివ్వలు తగిలి తలలు పగులుతున్నాయి. సమరంలో వాడే దివిటీల నుంచి నిప్పు రవ్వలు పడి , తొక్కిసలాటలో కిందపడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈసారి హింసను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా దేవరగట్టును పరిశీలించారు. బందోబస్తును సిద్ధం చేస్తున్నారు. ఈనెల 12న దసరా పండుగ రోజు అర్ధరాత్రి ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి బందోబస్తుగా 1000 మందికి పైగా పోలీసులు ఉంటారు. వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితులలో హించకు తావు లేదని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చెప్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..