AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిచ్చి పీక్‌స్టేజ్‌లో.. రీల్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్.. వీడియో వైరల్

ఈ రోజుల్లో రీలు చేయాలనే తపనతో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు వెనుకాడడం లేదు. అయితే కొందరు మాత్రం ఇలా రీల్స్ కోసం చేస్తున్న స్టంట్స్ తో మృత్యువుని ఒక్కసారి పలకరించి రెప్ప పాటులో ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూడండి. ఇందులో ఒక యువకుడు మొదట కూల్‌గా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు.

Viral Video: పిచ్చి పీక్‌స్టేజ్‌లో.. రీల్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్.. వీడియో వైరల్
Stunt Video ViralImage Credit source: Instagram
Surya Kala
|

Updated on: Oct 05, 2024 | 6:59 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో తమను తాము ఫేమస్ చేసుకోవడానికి.. రీళ్లు, వీడియోలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టే స్థాయిలో ప్రజలకు అలవాటు అయింది. ముఖ్యంగా యువతలో ఈ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ కుర్రాడు రీల్స్ చేయాలనే తపనతో రోడ్డు మార్గమధ్యలో ప్రమాదానికి గురై ఇబ్బంది పడ్డాడు.

ఈ రోజుల్లో రీలు చేయాలనే తపనతో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు వెనుకాడడం లేదు. అయితే కొందరు మాత్రం ఇలా రీల్స్ కోసం చేస్తున్న స్టంట్స్ తో మృత్యువుని ఒక్కసారి పలకరించి రెప్ప పాటులో ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూడండి. ఇందులో ఒక యువకుడు మొదట కూల్‌గా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. అయితే హటాత్తుగా స్టంట్స్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బైక్ మీద నుంచి రోడ్డు మీద పడి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ యువకుడు ఖాళీగా ఉన్న రోడ్డుపై మంచి వేగంతో బైక్ నడుపుతున్నాడు.. ఇంతలో హటాత్తుగా ఆ యువకుడు బండి మీద నిల్చుకునే ప్రయత్నం చేస్తూ తన రెండు కాళ్లను సీటుపై ఉంచి, హ్యాండిల్ పట్టుకుని బైక్ బ్యాలెన్స్ చేయడాన్ని ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఒక చేత్తో అతను సీటు మీద నిలబడటం మొదలుపెట్టాడు.. అయితే హటాత్తుగా ఆ యువకుడు బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో ఆ బైక్ మీద నుంచి ఆ యువకుడు రోడ్డుమీద పడ్డాడు.. ఆ బైక్ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి వెళ్ళిపోయింది. ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత ఆ యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయని ఎవరికైనా అర్ధం అవుతుంది.

ఈ వీడియో arariya_wala_0863 అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ వేలాది వ్యూస్ ని లైక్స్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి మూర్ఖత్వం పని చేసే ముందు ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి అంటూ ఓ యూజర్ వీడియోపై కామెంట్ చేశారు. మరొకరు నెక్స్ట్ ఇలాంటి స్టంట్ చేసే ముందు వందసార్లు ఆలోచిస్తాడని పేర్కొన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..