AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2024: షుగర్ పేషెంట్స్ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..! ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే

డయాబెటిక్ పేషెంట్ అయితే ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. తక్కువ వ్యవధిలో ఏదైనా తింటూ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్ ఉపవాస సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం.

Navratri 2024: షుగర్ పేషెంట్స్ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..! ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే
Navratri 2024 Diet
Surya Kala
|

Updated on: Oct 05, 2024 | 5:17 PM

Share

నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కొంతమంది నవరాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో చాలా మంది స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫాస్టింగ్ డైట్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు. పండ్లను ఉపవాస సమయంలో కూడా తినవచ్చు.. అయితే కొన్ని పండ్లలో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. తక్కువ వ్యవధిలో ఏదైనా తింటూ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్ ఉపవాస సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం.

బుక్వీట్ పిండి: ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నట్లు అయితే ఉపవాస సమయంలో బుక్వీట్ పిండితో చేసిన వస్తువులను తీసుకోండి. ఇది గ్లూటెన్ రహిత పిండి. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. నవరాత్రులలో టిక్కీ లేదా రోటీని తయారు చేసి తినవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

వాటర్ చెస్ట్ నట్స్ : నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటే మధుమేహ రోగులు వాటర్ చెస్ట్ నట్స్ పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పిండిలో కొన్ని వాల్‌నట్‌లను కూడా కలపవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన , శక్తివంతమైన పిండి. డయాబెటిస్‌ బాధితులకు ఈ రెండూ చాలా మేలు చేస్తాయి. వీటితో చేసిన ఆహారం తినడం వలన బలహీనత కలగదు.

ఇవి కూడా చదవండి

రాగి పిండి: శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించడానికి రాగి పిండితో చేసిన వాటిని తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.దీని కారణంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది.

తగినంత నీరు త్రాగాలి

ఉపవాస సమయంలో శరీరంలో హైడ్రేషన్ లో లోటు ఉండకూడదు. వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. శరీరంలో నీరు లేకపోవటం వల్ల నీరసం అనే ఫీలింగ్ మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా నీటిని త్రాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ