AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఓ వైపు స్వీట్ షాప్ లోపల స్వీట్లు తింటున్న ఎలుకలు.. మరోవైపు స్వీట్స్ కొంటున్న కస్టమర్స్.. వీడియో వైరల్

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బేకరీలో ఉంచిన స్వీట్‌పై ఒక ఎలుక చకచకా పరిగెడుతున్న వీడియో వైరల్‌గా మారింది. నవభారత్ టైమ్స్ పోస్ట్ చేసిన వార్తా నివేదిక ద్వారా షేర్ చేసిన వీడియో ద్వారా ఈ స్వీట్ షాప్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఈ సంఘటన ఢిల్లీలోని భజన్‌పూర్ ప్రాంతంలోని అగర్వాల్ స్వీట్స్‌లో జరిగినట్లు అర్థమవుతోంది.

Video Viral: ఓ వైపు స్వీట్ షాప్ లోపల స్వీట్లు తింటున్న ఎలుకలు.. మరోవైపు స్వీట్స్ కొంటున్న కస్టమర్స్.. వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Oct 05, 2024 | 6:09 PM

Share

బేకరీలో ఉంచే వెరైటీ స్వీట్లను చూస్తే ఎవరికైనా నోట్లో నీరు వస్తుంది. ఆరోగ్యం కోసం డైట్ చేస్తున్న వారు సైతం తమ ఆహార నియమాలను పక్కకు పెట్టేసి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. నోటిలో కరిగిపోయే స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే బయట ఆహారం తినే సమయంలో అక్కడి శుభ్రత గురించి ఒక్క సారి అలోచించాల్సిందే.. పరిసరాలను పరిశీలించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

బేకరీలో ఉంచిన స్వీట్‌పై ఒక ఎలుక చకచకా పరిగెడుతున్న వీడియో వైరల్‌గా మారింది. నవభారత్ టైమ్స్ పోస్ట్ చేసిన వార్తా నివేదిక ద్వారా షేర్ చేసిన వీడియో ద్వారా ఈ స్వీట్ షాప్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఈ సంఘటన ఢిల్లీలోని భజన్‌పూర్ ప్రాంతంలోని అగర్వాల్ స్వీట్స్‌లో జరిగినట్లు అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో @GagandeepNews అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అన్నిచోట్లా వైరల్ అవుతోంది. వీడియోలో గ్లాస్ డిస్‌ప్లే కేసులలో ఉంచిన స్వీట్‌లపై ఎలుక నడుస్తున్నట్లు చూడవచ్చు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో ఓ రేంజ్ లో షేర్ చేస్తూ వైరల్ కావడంతో నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వినియోగదారులు మిశ్రమ వ్యాఖ్యలు చేశారు. “ఇది పెంపుడు ఎలుక అయి ఉండాలి” అని ఒకరు హాస్యంగా కామెంట్ చేస్తే.. మరొకరు ఈ స్వీట్ స్నాక్స్ తింటే రోగాలు గ్యారెంటీ అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..