బుడ్డొడు కాదురా బాబోయ్.. దొంగిలించిన కారు నడుపుతూ పట్టుబడ్డ 10ఏళ్ల బాలుడు.. నిజం తెలిసి ఖాకీలే షాక్..!
పదేళ్ల వయసులో ఇలాంటి చర్యలకు పాల్పడడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిన్నారి ఆగస్ట్‌లో కూడా కారు చోరీకి ప్రయత్నించాడని చెప్పారు. అయితే, నేరం చేసినప్పటికీ నిందితుడు చిన్నపిల్లవాడు కాబట్టి, పోలీసులు అతడిని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
చిన్న వయస్సులోనే కొందరు పిల్లలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఉదంతం ఒకటి అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం నుంచి వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే ఓ స్కూల్ గ్రౌండ్‌లో దొంగిలించిన కారును నడుపుతూ 10 ఏళ్ల బాలుడు పట్టుబడ్డాడు. స్కూల్ గ్రౌండ్‌లో పిల్లలు, సిబ్బందితో రద్దీగా ఉండగా, బాలుడు వేగంగా కారు నడుపుతూ అందరినీ హడలెత్తించాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
స్థానిక పోలీసులు ఈ కేసును విచారించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇది అతని మూడవ అరెస్టు. అతను కారు దొంగతనం, దోపిడీ, ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేయడం వంటి డజను కేసుల్లో ఈ బాలుడు నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు చెప్పిన ఈ విషయాలు అందరినీ విస్మయానికి గురిచేసింది.
పదేళ్ల వయసులో ఇలాంటి చర్యలకు పాల్పడడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిన్నారి ఆగస్ట్‌లో కూడా కారు చోరీకి ప్రయత్నించాడని చెప్పారు. అయితే, నేరం చేసినప్పటికీ నిందితుడు చిన్నపిల్లవాడు కాబట్టి, పోలీసులు అతడిని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..