ఉత్తరప్రదేశ్ ప్రజల్ని హడలెత్తిస్తున్న ఆరో తోడేలు హతం..
ఇకపోతే, తోడేళ్ళ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 10 మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. మరో 20మందికి గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా దాడులు చేస్తున్న తోడేళ్ళు చిన్నపిల్లలే టార్గెట్‌గా దాడి చేశాయి. వీటిని పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది.
గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ ప్రజలను వణికిస్తున్న ఆరో తోడేలు ఎట్టకేలకు హతమైంది. బహరాయిచ్ జిల్లా ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న ఆరో తోడేలును గ్రామస్థులు మట్టుబెట్టారు. జిల్లాలోని తమాచ్‌పుర్ గ్రామంలో ఈ ఘటన శనివారం చోటు చేసుకొంది. అటవీశాఖాధికారులు దాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దీంతో తోడేళ్ళ బాధిత గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఆపరేషన్ భేడియా కొలిక్కి వచ్చినట్లైంది.
ఇకపోతే, తోడేళ్ళ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 10 మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. మరో 20మందికి గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా దాడులు చేస్తున్న తోడేళ్ళు చిన్నపిల్లలే టార్గెట్‌గా దాడి చేశాయి. వీటిని పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది. కనిపిస్తే కాల్చి చంపేయమని సీఎం యోగి గర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది.
తోడేళ్ళ వలన కొన్ని గ్రామాలకు కంటి మీద కునుకే లేకుండా పోయింది. ముందుగా నరమాంస భక్షక తోడేళ్ళ గుంపులో ఐదింటిని పట్టుకోగా, ఆరో తోడేలు గ్రామస్తుల చేతిలో హతమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..