AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: వాట్ ఏ ఐడియా సర్ జీ.. డ్రోన్‌తో వినూత్న ప్రయోగం

ఈ మధ్య కాలంలో డ్రోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. అనేక రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మందులు పిచికారి చేయడానికి ప్రత్యేక డ్రోన్లను వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించారు. అదే విధంగా లాజిస్టిక్స్‌‌లో డ్రోన్ల‌ను వినియోగించేలా ప్రత్యేకంగా ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయి.

Guntur: వాట్ ఏ ఐడియా సర్ జీ.. డ్రోన్‌తో వినూత్న ప్రయోగం
An Innovative Experiment Wi
T Nagaraju
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 06, 2024 | 12:26 PM

Share

ఈ మధ్య కాలంలో డ్రోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. అనేక రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మందులు పిచికారి చేయడానికి ప్రత్యేక డ్రోన్లను వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించారు. అదే విధంగా లాజిస్టిక్స్‌‌లో డ్రోన్ల‌ను వినియోగించేలా ప్రత్యేకంగా ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో దోమల నివారణకు డ్రోన్లు ఉపయోగించి మందులు పిచికారి చేస్తున్నారు. తాజాగా విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో వాహనాలు వెళ్లలేని అపార్ట్‌మెంట్స్ వద్దకు ఆహారాన్ని డ్రోన్ల సాయంతోనే పంపించారు. ఇలా అనేక విధాలుగా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

శనివారం గుంటూరులో మరొక వినూత్న కార్యక్రమానికి డ్రోన్ల ద్వారా శ్రీకారం చుట్టారు. సుదూర ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు మందులు పంపిణీ చేసేందుకు డ్రోన్‌ను ఉపయోగిస్తూ చేసిన ప్రయోగం విజయవంతమైంది. చిన్న విమానం రూపంలో డ్రోన్‌ను తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి పీహెచ్‌సీ నుంచి అన్నవరపు లంకలోని ఆయుస్మాన్ కేంద్రానికి పది కిలోల టీకాలు, మందుల కిట్‌ను ఇందులో ఉంచి పంపించారు. పదినిమిషాల్లోనే డ్రోన్ మున్నంగి నుంచి అన్నవరపు లంక చేరింది. అన్నవరపు లంక క్రిష్ణా నది మధ్యలో ఉంటుంది.

సాధారణ రోజుల్లో సులభంగానే ఈ గ్రామానికి చేరుకోవచ్చు. అయితే క్రిష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో ఈ గ్రామానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదరవుతున్నాయి. పడవల్లో వెళ్లాలంటే రిస్క్ చేయాల్సిన పరిస్తితి వస్తుంది. ఈ క్రమంలోనే అత్యవసరమైన మెడిసిన్  ఆపత్కాల సమయంలో పంపించేలా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యులు లక్ష్మీ సుధ, తహశీల్ధారు సిద్దార్ధ, ఎంపీడీవో విజయ లక్ష్మీ దగ్గర నుంచి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు చెప్పారు.

మందులు పంపిణీ చేసేందుకు డ్రోన్‌ను ఉపయోగిస్తూ చేసిన ప్రయోగం వీడియో:

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ