AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punganur: పుంగనూరులో చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి అండగా నేతలు

చిత్తూరు జిల్లాలో 7 ఏళ్ల చిన్నారి మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. పుంగనూరు రాజకీయాన్ని మరోసారి వేడెక్కించింది. గత నెల 29న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆస్తీయా ఆ తరువాత కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభించడంతో సంచలనంగా మారింది.

Punganur: పుంగనూరులో చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి అండగా నేతలు
Punganur Incident
Raju M P R
| Edited By: |

Updated on: Oct 06, 2024 | 12:24 PM

Share

చిత్తూరు జిల్లాలో 7 ఏళ్ల చిన్నారి మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. పుంగనూరు రాజకీయాన్ని మరోసారి వేడెక్కించింది. గత నెల 29న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆస్తీయా ఆ తరువాత కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభించడంతో సంచలనంగా మారింది. ఆస్తీయాది హత్యేనని దోషులని శిక్షంచాలి, బాలిక మృతి టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనని వైసీపీ ఆరోపిస్తుంది.

పుంగనూరులో జరిగిన మైనర్ బాలిక ఆస్తీయా హత్య కేసు వివాదాస్పదంగా మారింది. ఒకవైపు వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు మాజీ సీఎం జగన్ పరామర్శకు సిద్ధమైతే టీడీపీ నుంచి రాష్ట్ర మంత్రులు ఆస్తియా కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇలా టీడీపీ వైసీపీ పరామర్శలతో మరోసారి పుంగనూరు రాజకీయం వేడెక్కింది.

గత నెల 29న మిస్ అయిన బాలిక అస్థియా ట్యూషన్‌కి వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఈ మేరకు అదే రోజు పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు అయ్యింది. ఆస్తియా మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ ఆచూకీ కనుగొనేందుకు 11 టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్టోబర్ 2న ఆస్తియా డెడ్ బాడీని గుర్తించారు.

ఈ మేరకు ఆస్తియా హత్యకు గురైందని కేసును ఆల్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తియా హత్య పోలీసుల వైఫల్యమంటున్న వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. మరోవైపు ఆస్తియా మృతిపై విచారం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్న చిత్తూరు జిల్లా ఎస్పీ నిందితులను అరెస్టు చేసి కేసును ఛేదిస్తామంటున్నారు

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!