Tirumala: తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ దుమారం.. దుష్ప్రచారమంటున్న టీటీడీ
తిరుమలలో అన్న ప్రసాదం లో జెర్రీ ప్రత్యక్షం అయిందన్న ప్రచారం కలకలం రేపింది. పాంచజన్యము అన్న ప్రసాద కేంద్రంలో పెరుగన్నం స్వీకరించిన భక్తుడికి జెర్రీ కనిపించిదన్న వార్త కలవరపాటుకు గురిచేసింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పై భక్తుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలుపడంతో..
తిరుమలలో అన్న ప్రసాదం లో జెర్రీ ప్రత్యక్షం అయిందన్న ప్రచారం కలకలం రేపింది. పాంచజన్యము అన్న ప్రసాద కేంద్రంలో పెరుగన్నం స్వీకరించిన భక్తుడికి జెర్రీ కనిపించిదన్న వార్త కలవరపాటుకు గురిచేసింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పై భక్తుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలుపడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో టీటీడీ స్పందించింది.
అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని ప్రకటన విడుదల చేసింది. మాధవ నిలయంలోని అన్నప్రసాద కేంద్రంలో తాను తిన్న అన్నప్రసాదంలో జెర్రీ కనబడిందని భక్తుడు చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలను తయారుచేస్తోందని, జెర్రీ వచ్చిందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరంగా ఉందని టీటీడీ పేర్కొంది.
ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారని, అలాంటప్పుడు జెర్రీ ప్రత్యక్షం కావడం అనేది కావాలని చేసిన చర్య మాత్రమే గానే భావించాల్సి వస్తుందని టీటీడీ ప్రకటనలో అభిప్రాయపడింది. భక్తులెవరూ ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి