AP Election Results: ‘ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది’.. కాయ్ రాజా కాయ్.. రూ.లక్షకు 5 లక్షలు..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ, కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ జరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. దాంతో, ఏపీలో పెద్దఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయ్.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ, కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ జరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. దాంతో, ఏపీలో పెద్దఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయ్. మూడే మూడు కేటగిరీల్లో ఎక్కువగా పందేలు నడుస్తున్నాయ్. ఒకటి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది?. రెండోది పిఠాపురంలో పవన్ మెజారిటీపైనా!. అలాగే.. చంద్రబాబు, జగన్ మెజారిటీలపైనా!. ఇక మూడోది… నియోజకవర్గాల వారీగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయ్.
పవన్ కల్యాణ్, చంద్రబాబు, జగన్ మెజారిటీలపై బెట్టింగ్‌లు హై రేంజ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.. లక్షకు ఐదు లక్షలుగా బెట్టింగ్ లు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఇలా వందల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం..
లైవ్ వీడియో చూడండి..
ఇక, జగన్ వర్సెస్ కూటమిపైనా జోరుగా పందేలు నడుస్తున్నాయ్. అలాగే, బోండా ఉమ గెలుస్తారా… లేదా అనేదానిపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
