Andhra: మంగళవారం ఆ జిల్లాలోని విద్యాసంస్థలు అన్నింటికి సెలవు..
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌వైపు దూసుకువస్తుంది. అక్టోబర్ 28వ తేదీ అర్థరాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వరకూ కాకినాడ జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కడప, అన్నమయ్య, ఏలూరు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, పల్నాడు జిల్లాల్లో మంగళవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. తుపాను తీవ్రత, పరిస్థితిని అనుసరించి సెలవులలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.

అక్టోబర్ 28 మంగళవారం పల్నాడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 28వ తేదీ సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
Also Read: ఒక్కో కుటుంబానికి తక్షణమే రూ.3 వేలు ఇవ్వండి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..
ఇక మంగళవారం రోజున శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, కాకినాడ, జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, జిల్లా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది.
తుఫాన్ హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తుఫాను ప్రభావిత జిల్లాలకు శాటిలైట్ ఫోన్లు అందించడంతో పాటు NDRF, SDRF బృందాలను సిద్ధం చేసింది. సహాయక చర్యల కోసం ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బందిని సిద్ధం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




