AP Rains: బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజులలో ఇది అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది.

AP Rains: బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 17, 2024 | 8:30 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. మరో రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని కోస్తా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయంటే..

ఇది చదవండి: శివారు పొలంలో పని చేస్తుండగా ఏదో అలికిడి.. అటు వెళ్లి చూడగా బిత్తరపోయిన రైతు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- —————————————-

ఈరోజు:-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..