AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం

దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు.

Andhra Pradesh: శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం
Historical Step Well
J Y Nagi Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Dec 17, 2024 | 9:39 AM

Share

ఎన్నో వందల సంవత్సరాల పురాతన భావి చరిత్ర వెలుగులోకి వచ్చింది.. పూర్వీకులు ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పకళా సంపద బయటి ప్రపంచానికి తెలిసింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన యుగంధర్ అనే యువకుడు బావి దుస్థితి చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు ఆ వీడియోను కొందరు నారా లోకేష్ కు ట్యాగ్ చేయగా, నారా లోకేష్ ఈ భావి దుస్థితిపై స్పందించి చరిత్రను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని, ప్రాచీన గుడులను, బావులను రక్షిస్తామని నారా లోకేష్ రి ట్విట్ చేశారు.

అలా ఈ వీడియో వైరల్ కావడంతో నంద్యాల పట్టణానికి చెందిన మన ఊరు, మన గుడి, మన బాధ్యత అనే స్వయం సంస్థ భావితరాలకు… భవిష్యత్ తరాలకు తీపి గుర్తులుగా మిగిల్చే సంపదను కాపాడేందుకు ముందుకొచ్చింది. శతాబ్దాలక్రితం నాటి శిల్పులు చెక్కిన సొగసైన మెట్లబావిని నంద్యాలకు చెందిన శివ కుమార్ రెడ్డి తన మిత్రబృందంతో కలిసి శుభ్రపరిచారు. దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు.

చరిత్రలో భాగమైన మెట్ల బావి నిరాదరణకు గురై రూపు రేఖలు కోల్పోయిన సందర్భంలో మన ఊరు…మన గుడి… మన బాధ్యత అనే సంస్థ సభ్యులు సుమారు 80 మంది నల్లమల అంచుల్లోని కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చేరుకొని శ్రమదానం చేశారు. చెత్తా చెదారని తొలగించి మురుగు నీటిని మోటార్ల ద్వారా బయటికి తోడి బావికి కొత్త సొగసులు అందించారు. చారిత్రాత్మక మెట్ల బావిని పునరుద్ధరించి ఎన్నో జీవరాసులకు ఆయువు కేంద్రంగా మార్చారు. శిల్ప సంపదతో పాటు… చరిత్రకారులు చెక్కిన నాటి శిలాక్షరాలను నేటి తరానికి పరిచయం చేయడం శుభ పరిణామం..

ఇవి కూడా చదవండి

బావి చరిత్ర..

ఆ బావి చరిత్ర విషయానికి వస్తే గత మూడు వందలు, లేదా నాలుగు వందల సంవత్సరాల పైగా పూర్వం రాజుల కాలంలో ఈ బావిని నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాలను బట్టి తెలుస్తుంది శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే సమయంలో అక్కడ ఉండడానికి సేద తీరడానికి కూడా మఠాలు నిర్మించినట్లు గ్రామస్తులు తెలియజేశారు. మరోవైపు ఈ బావిలో నుంచి పూర్వం నీటిని తీసుకువెళ్లి గువ్వలకుంట్ల గ్రామంలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత విశిష్టత ఉన్న శిల్పకళా బావిని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చి.. భవిష్యత్ తరాలకు నేనున్నానంటూ తెలియజేసింది. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికైనా గ్రామస్తులు ఈ బావికి పూర్వ వైభవం తీసుకురావాలని చరిత్రకారులు హిందూ సంఘాలు కోరుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..