Andhra News: ఆ అమ్మవారి కోసం ఉద్యమం.. ఊరు ఊరంతా ఒక్కటై ఏం చేశారంటే?
పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం సౌత్ గ్రామంలోని రాజుల పాలెంలోని శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆలయం గుడికి ఎదురుగా నివాసముంటున్న అదే గ్రామానికి చెందిన చెరుకూరి ప్రసాదరాజు గత కొంతకాలంగా భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం సౌత్ గ్రామంలోని రాజుల పాలెంలోని శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆలయం గత 102 సంవత్సరాలుగా ఉంది. అయితే గుడికి ఎదురుగా నివాసముంటున్న అదే గ్రామానికి చెందిన చెరుకూరి ప్రసాదరాజు గత కొంతకాలంగా సత్తెమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసుకునే భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామానికి చెందిన భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులను సత్తమ్మ తల్లి వారిని హిందూ మతాన్ని కించపరుస్తూ అనేకమార్లు దుర్భాషలు ఆడారని అయితే గ్రామానికి చెందిన పెద్దలు పలుమార్లు హెచ్చరించిన ప్రసాద్ రాజు అనే వ్యక్తి హిందూ దేవాలయం పేరుతో వ్యాపారం చేస్తున్నారని గుడి ప్రభుత్వ స్థలంలో ఉంది కాబట్టి తొలగించాలని అధికారులకు తమపైన ఆలయం పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు.
అమ్మవారి ఆలయానికి సంబంధించి తమ వద్ద పంచాయతీ తీర్మానంతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని సదరు వ్యక్తి హిందూ మతాన్ని అవహేళన చేస్తూ భక్తులను పలుమార్లు కించపరిచారని భక్తులు చెబుతున్నారు. ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుని తక్షణమే హిందువులకు సత్తమ్మ తల్లి వారికి క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఎంతవరకైనా వెళ్తామని గ్రామస్థులు అందరూ సమావేశం అయ్యి తీర్మానం చేసారు. అయినా ప్రసాదరాజు తన కుటుంబంపై గ్రామస్థులు కక్ష కట్టారని తాను వెనక్కు తగ్గేది లేదని తెలపడంతో గ్రామస్థులు నరసాపురంకు చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆదివారం సమావేశం అయ్యారు. దీంతో గ్రామం వేడెక్కింది. పోలీసులు భారీగా మొహరించారు. సమవేశంలో హిందువులు ప్రసాదరాజును హెచ్చరించారు. మరోసారి గుడి జోలికి వస్తే భౌతిక దాడి తప్పదని హెచ్చరించారు. అయితే పూర్వం నుండి ఆలయం ఉంటుంది. కాబట్టి తాము ఆలయం జోలికి వెళ్ళామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే సత్తెమ్మ తల్లి ఆలయం వివాదం చిలికి చిలికి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తయారవ్వక ముందే సమస్యకు పరిష్కారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి