AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: అల్పపీడనంతో ఏపీలో వర్షాలే వర్షాలు.. ఐదు రోజులు జాగ్రత్త.. ముఖ్యంగా ఈ జిల్లాలకు!

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణీ ఏర్పడింది. మరికొద్ది గంటల్లో..

AP Rains: అల్పపీడనంతో ఏపీలో వర్షాలే వర్షాలు.. ఐదు రోజులు జాగ్రత్త.. ముఖ్యంగా ఈ జిల్లాలకు!
Andhra Weather Update
Maqdood Husain Khaja
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 19, 2023 | 11:43 AM

Share

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణీ ఏర్పడింది. మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనం గా బలపడే అవకాశం ఉంది. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. తీరం వెంబడి ఈదురు గాలల తీవ్రత పెరిగింది. సముద్రంలో రాగల ఐదు రోజుల్లో మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జరి అయ్యాయి.

అక్కడే వర్షాలు…

రుతుపవన ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. చత్తీస్‌గడ్, ఒడిస్సా తీరాలకు అనుకొని ఉన్న ఆవర్తనల ప్రభావంతో తెలంగాణపై అదికంగా వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఆవర్తనం మరికొద్ది గంటల్లో బలపడే అవకాశం ఉందని.. ఏపీలోని ఉత్తరకొస్తాపై అధికంగా ప్రభావం ఉంటుందని అన్నారు. ఆ ప్రాంతంలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు అవుతుందన్నారు. వాగులో గడ్డలు పొంగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోనూ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు పునంద. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వేస్తాయని, అల్పపీడన పరిస్థితుల నేపథ్యంలో అల్లకల్లోలంగా సముద్రం మారుతుందని.. రాగల ఐదు రోజుల్లో సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు.

వర్షపాతం ఎక్కడెక్కడ..

గడచిన 24 గంటల్లో ఉత్తరకొస్తా జిల్లాల్లో చాలాచోట్ల వర్షాలు విస్తారంగా కురిసాయి. అత్యధికంగా చింతూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. పాడేరులో ఏడు సెంటీమీటర్లు, నెల్లిమర్లలో 6, వీరఘట్టం 6, పాలకొండ 5, కుకునూరు లో 5, విజయనగరం జిల్లా పూసపాటిరేగ, శృంగవరపుకోట, బాలాజీ పేట,టెక్కలి, కూనవరం, గరివిడి, మేరక ముడిదం, రణస్థలంలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. కళింగపట్నం, గజపతినగరం, విజయనగరం, చింతలపూడి, చీపురుపల్లి, గరుగుబిల్లి, అరకు వ్యాలీ, గంట్యాడ, చింతపల్లిలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

అల్లూరి ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు..

అల్లూరి జిల్లా ఏజెన్సీలో మూడు రోజులుగా ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహిస్తున్నయి వాగులు, వంకలు. పాడేరు మం డలం రాయగడ్డ వంతెన పొంగి 30 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం…. పర్దనపుట్టు మత్స్యగెడ్డ పొంగి 50 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పెదబయలు, ముంచంగిపుట్టు, జి మాడుగుల మండలాల్లో మారుమూల గ్రామాలను నుండి మండల కేంద్రానికి రాలేకపోతున్నారు గిరిజనులు. అరకు లోయ ఏజెన్సీలోని చాలాచోట్ల వాగులు పొంగుతున్నాయి.