- Telugu News Photo Gallery Pawan Kalyan Says that he hopes TPD, BJP, Janasena parties will come together to oust the YCP govt in Andhra Pradesh
Pawan Kalyan: వైసీపీని ఓడించేందుకు అలా జరుగుతుందని ఆశిస్తున్నా.. పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టీడీపీ, జనసేన పార్టీలు అనేక వ్యూహాలు రచిస్తు్న్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Updated on: Jul 19, 2023 | 11:28 AM

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టీడీపీ, జనసేన పార్టీలు అనేక వ్యూహాలు రచిస్తు్న్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి టీపీడీ, బీజేపీ, జనసేన పార్టీలు కలుస్తాయని ఆశిస్తున్నట్లు పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలో ప్రజల కలలు నెరవేర్చేందుకు మరోసారి ఎన్డీయేకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్ల కూటమి గెలవడమే లక్ష్యమని తెలిపారు. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఏడాది లోపు వస్తాయా లేదా అంతకుముందే వస్తాయా అనేది తమకు తెలియదని.. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో చాలా అసంతృప్తి ఉందని.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధికార పార్టీ నేతలకు భయాన్ని పుట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా ప్రజల సున్నితమైన సమాచారాన్ని సేకరించి తెలంగాణలో ఉన్న డేటా సెంటర్లలో పెడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించడానికి విపక్ష పార్టీలు కలిసి పోరాటం చేయాలనేదని తన అభిప్రాయమని అన్నారు. టీడీపీతో మూడు పార్టీలు కలుస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎవరూ సీఎంగా ఉండాలన్నది తమ కూటమికి ముఖ్యం కాదని.. వైసీపీని ఓడించి రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం అందిచడం గురించే ఆలోచిస్తానని అన్నారు.

అలాగే ఎన్డీఏ సమావేశంలో ఏపీలో పొత్తుల గురించి ప్రత్యేకంగా చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దేశం గురించే మాట్లాడారని.. ఇదే అంశంపైనే చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అలాగే ఎన్డీఏలోకి కొత్త పార్టీలు చేర్చుకొనే అంశాల గురించి కూడా మాట్లాడలేదని అన్నారు. ఒకవేళ కొత్త పార్టీలు చేరే అవకాశం ఉందా అని అడగగా రాజకీయాల్లో ఏదైనా జరగొచచ్చు అని సమాధామిచ్చారు పవన్ కల్యాణ్.
