AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iphones: ఐఫోన్లపై ఆ దేశంలో నిషేధం విధింపు.. ఇకనుంచి వాడకూడదంటూ హెచ్చరికలు

ఎవరైనా యాపిల్ ఫోన్, లాప్‌టాప్ వాడితే అమ్మో యాపిల్ డివైజ్ వాడుతున్నారని గొప్పగా చూస్తారు. ఎందుకంటే యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అలాంటింది. కొంతమంది యాపిల్ ఫోన్స్, లాప్‌టాప్స్ కొనేందుకు చాలారోజుల డబ్బులు దాచుకొని కొంటే.. మరికొందరు అప్పలు చేసి, ఈఎమ్ఐలతో కూడా ఆ ప్రొడక్ట్స్ కొనేందుకు మొగ్గు చూపుతుంటారు.

Aravind B
|

Updated on: Jul 19, 2023 | 9:40 AM

Share

1 / 5
యాపిల్‌లో ప్రొడక్ట్స్‌లో ఉండే నాణ్యత, సెక్యూరిటీ గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇది ప్రపంచంలో నెంబర్ 1 బ్రాండ్‌గా దూసుకుపోతూ ప్రజల ఆదరణ పొందుతోంది. ఇలాంటి నేపథ్యంలో రష్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

2 / 5

ఐఫోన్ వాడకాన్ని నిషేధించాలని రష్యా నిర్ణయించింది. అలాగే అక్కడి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఐఫోన్‌ వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇందుకు ప్రధాన కారణం.. యాపిల్ అమెరికాకు చెందిన సంస్థ కావడమే. అంతేకాకుండా అమెరికా కంపెనీలు తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాయని రష్యా అధికారులు భావిస్తున్నారు.

3 / 5
అమెరికా తమ ఉత్పతులను రష్యాకు ఎగుమతి చేసి హ్యాకింగ్‌‌లకు పాల్పడే అవకాశం ఉందని ఈ ఏడాది మార్చిలోనే రష్యా ప్రభుత్వం గుర్తించింది. యాపిల్ ప్రొడక్ట్స్ వాడటం మానేయాలని అప్పుడే అధికారులకు సూచించింది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని చాలా సిరియస్‌గా తీసుకుంది.

4 / 5
అమెరికన్ దేశస్థులు తమ పరికరాలను వైర్ ట్యాపింగ్ కోసం వినియోగించుకునే అవకాశం ఉందని.. తమ దేశ అధికారులు భావస్తున్నారని రష్యా సెక్యూరిటీ ఇంటిలిజెన్స్ సర్వీసెస్ నిపుణలు చెబుతున్నారు. అలాగే ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మొదలయ్యాక పరిణామాలు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెల్త్, టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో దేశియంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్లనే వాడాలనే నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం కూడా చేశారు. అందుకోసమే యాపిల్ ప్రొడక్ట్స్‌పై నిషేధం విధించాలని నిర్ణయించినట్లు సమాచారం.

5 / 5