AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు..

దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆవరించి ఉన్న ద్రోణి ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్..

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు..
కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునడంతో రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నాలాల వెంబడి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్‌ హోల్స్‌ ఉన్నాయో తెలియక జనం ఆందోళనకు లోనయ్యారు. అత్యధికంగా శేరిలింగంపల్లి ఖాజాగూడలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత షేక్‌పేటలో 5.2 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 4.6 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 4.5 సెంటీమీటర్లు, సింగిరేణికాలనీలో 4.1 సెంటీమీటర్లు, అమీర్‌పేటలో 4.0 సెంటీమీటర్లు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Ravi Kiran
|

Updated on: Mar 20, 2023 | 4:42 PM

Share

దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆవరించి ఉన్న ద్రోణి ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్ వరకు  రాయలసీమ, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

రాబోయే రెండు రోజులకు వాతావరణ సూచనలు:-

  • ఉత్తర కోస్తాంధ్ర, యానాం:-

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సంభవించే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులు(గంటకు 30-40కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

  • దక్షిణ కోస్తాంధ్ర:-

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

  • రాయలసీమ:-

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?