Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారంటూ..

నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారని జగన్‌ ఆరోపించారు. ఈ స్కిల్‌ ద్వారా విద్యార్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు. సీమెన్స్‌ పేరుతో రాష్ట్రంలో..

Andhra Pradesh: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారంటూ..
Cm Jagan On Skill Development
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 20, 2023 | 4:20 PM

దేశ చరిత్రలో నిరుద్యోగులను మోసం చేసిన అతి పెద్ద కుంభకోణం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అని సీఎం జగన్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారని జగన్‌ ఆరోపించారు. ఈ స్కిల్‌ ద్వారా విద్యార్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు. సీమెన్స్‌ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్‌ జరిగిందని జగన్‌ అన్నారు. సీమెన్స్‌ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద కుంభకోణాన్ని చంద్రబాబు నడిపారని సీఎం జగన్‌ అన్నారు. ఈ కుంభకోణంలో 371 కోట్ల రూపాయలు మాయం చేశారని ఆరోపించారు. షెల్‌ కంపెనీల ద్వారా రకరకాల మార్గాల్లో రూటింగ్‌ చేసి మళ్లీ ఆ డబ్బు మళ్లీ చంద్రబాబు దగ్గరకు చేర్చారని వివరించారు. ఇది ఒక నిపుణుడైన నేరగాడు చేసిన నేరం ఇదని జగన్‌ అన్నారు.

కేబినెట్‌లో చర్చించి జారీ చేసిన GOకు విరుద్ధంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ సాగిందని జగన్‌ విమర్శించారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచేసిన తీరుకు సరైన ఉదాహరణ ఈ స్కామ్‌ అని అన్నారు. షెల్‌ కంపెనీల ద్వారా డబ్బు తిరిగి హైదరాబాద్‌లోని చంద్రబాబు దగ్గరకు చేరిందని తెలిపారు. అన్ని దర్యాప్తు సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని జగన్‌ వివరించారు.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో విచారణ అంటూ జరిగితే ఎలా తప్పించుకోవాలో ముందుగానే చంద్రబాబు ఊహించారని సీఎం జగన్‌ అన్నారు. అసలు కేసు విచారణే జరపకుండా చంద్రబాబు ఎంతో గొప్ప విజన్‌తో వ్యవహరించారని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కామ్‌ ఊపిరిపోసుకుందని జగన్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి

స్కిల్ డెవలెప్‌మెంట్‌పై కురసాల కన్నబాబు ఏమన్నారంటే..? 

స్కీల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో రెండు టోకెన్లు హైదరాబాద్‌కు మళ్లాయని వైసీపీకి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. అసెంబ్లీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై జరిగిన చర్చలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో బయటకు పంపించినట్టు GST అధికారులు గుర్తించారని సభకు తెలిపారు. సీమెన్స్‌ సంస్థతో జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఉత్తరప్రత్య్తురాలను డిలీట్‌ చేశారని కన్నబాబు వివరించారు. ఈ స్కామ్‌లో పెద్దల పాత్ర ఉంది కాబట్టే వాళ్లు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..