Andhra Pradesh: టెన్షన్ టెన్షన్.. సుప్రీంకోర్టుకు మూడు రాజధానుల రగడ.. ఆ రోజే కీలక విచారణ

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఇష్యూ.. ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు చేసి తీరుతామని పాలకులు చెబుతుంటే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు....

Andhra Pradesh: టెన్షన్ టెన్షన్.. సుప్రీంకోర్టుకు మూడు రాజధానుల రగడ.. ఆ రోజే కీలక విచారణ
Supreme Court
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 27, 2023 | 12:15 PM

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఇష్యూ.. ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు చేసి తీరుతామని పాలకులు చెబుతుంటే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు చేరింది. ఈ క్రమంలో మూడు రాజధానుల వ్యవహారంపై మార్చి 28న విచారణ జరిగనుంది.  ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ తేదీని ఖరారు చేసింది. కేసును త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేసు విచారణ తేదీని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా.. తాము మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామంటున్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఏపీకి విశాఖపట్నం రాజధాని కాబోతోందని స్పష్టం చేశారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతానని వెల్లడించారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి.. అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌.. లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2015లోనే దీన్నీ నోటిఫై చేశారని వివరించారు. 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తెచ్చిందని చెప్పారు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజధాని అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్