Happy Mothe’s Day: అమ్మే దైవం అంటున్న తనయుడు.. 10కోట్ల వ్యయంతో ఆగమశాస్త్ర ప్రకారం తల్లికి ఆలయం.. నీ ప్రేమకు సలామ్
నవమాసాలు కడుపున మోసి.. ప్రసవవేదనను పంటిబిగువనపట్టి.. తనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి.. తనకంటూ సమాజంలో ఒక గుర్తింపు వచ్చే వరకూ కష్టాలను ఇష్టంగా భరించిన అమ్మ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలను అని ఆలోచించాడు ఒక కొడుకు.. తన అమ్మని దైవం గా తలచి ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన సనపల శ్రావణ్‌కుమార్.
పేగు పంచి.. ప్రేమ పంచి.. ప్రతీక్షణం కన్నబిడ్డల బాగును కాక్షించి.. తాను కొవ్వొత్తిలా కరిగిపోయే త్యాగమూర్తి అమ్మ. జన్మనివ్వడమే కాదు.. నీ జన్మకో సార్థకతను అందించేందుకు అనుక్షణం తపనపడుతందా తల్లి. అందుకే.. అమ్మంటే ఆకాశమంత ప్రేమ. తన బిడ్డలు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలన్న తపన తల్లిది. అందుకే, ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే. మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలో మాతృమూర్తులందరికీ ప్రణమిల్లుదాం. నిజమే.. నవమాసాలు కడుపున మోసి.. ప్రసవవేదనను పంటిబిగువనపట్టి.. తనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి.. తనకంటూ సమాజంలో ఒక గుర్తింపు వచ్చే వరకూ కష్టాలను ఇష్టంగా భరించిన అమ్మ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలను అని ఆలోచించాడు ఒక కొడుకు.. తన అమ్మని దైవం గా తలచి ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన సనపల శ్రావణ్‌కుమార్. వివరాల్లోకి వెళ్తే..
శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు కృష్ణారావు, అనసూయాదేవి. తన కొడుకుని చదువు విషయంపై అనసూయాదేవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అనుక్షణం ఉన్నత విద్య చదువుకోవాలని చెబుతూ.. శ్రావణ్ కు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో మంచి చదువు చదువుకున్న శ్రావణ్ కుమార్ హైదరాబాద్ లో బిజినెస్ పెట్టుకుని సక్సెస్ అందుకున్నారు. అయితే శ్రావణ్ తల్లి అనసూయాదేవి 2008లో మరణించింది. తన తల్లి జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండాలని భావించిన శ్రావణ్ ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. దీంతో 2019 పదికోట్ల వ్యయంతో చీమలవలసలో ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. అమ్మ దేవస్థానాన్ని ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నిర్మించడానికి యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ నిర్మాణం కోసం నిర్మాణ స్తపతుల్లో ఒకరైన బలగం చిరంజీవి, తమిళనాడుకు చెందిన శిల్పి పాండీదురై, ఒడిశాకు చెందిన శిల్పకారుల సురేష్ బృందాన్ని సంప్రదించాడు. వారికీ తన తల్లి కోసం నిర్మిస్తున్న ఆలయం నిర్మాణం పనులు అప్పగించాడు.
తల్లి అనసూయదేవి గుడిని నిర్మించడానికి పూర్తిగా కృష్ణశిలను మాత్రమే వాడుతున్నాడు శ్రావణ్. కృష్ణశిలలను ఒకదానికొకటి అతికించడానికి సిమెంట్ వాడకుండా.. ప్రాచీన ఆలయాల నిర్మాణంలో ఉపయోగించిన రాయి బంధన మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు. తుమ్మబంకను తమిళనాడు నుంచి, శ్రీశైలం నుండి కొబ్బరి పీచు, తాడేపల్లిగూడెం నుంచి సున్నం తీసుకొచ్చి రాయి బంధన మిశ్రమం తయారు చేస్తున్నారు. ఆలయం దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నాడు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇటుకలను వినియోగించడం లేదు. ఈ ఆలయ నిర్మాణం పనులు నులు ప్రస్తుతం 70శాతం పూర్తయ్యాయి. గుడి ప్రధాన గోపురం ఎత్తు 51 అడుగులు ఉండేలా.. పంచగోపురాలను నిర్మిస్తున్నారు. ఆలయ మూలవిరాట్టుగా శ్రావణ్ తల్లి అనసూయదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.
అమ్మ ప్రేమ గొప్పతనం తెలియజేసే విధంగా ఆలయ గోడలు, స్థంబాల పై ఏర్పాటు చేసే శిలలను ఎంతో అందంగా తీర్చి దిద్దుతున్నారు. ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని పొందుపరుస్తూ.. నగిషీలతో శిలలలు ఏర్పాటు చేస్తున్నారు. ఉట్టిపడేలా కట్టడాలు చేపట్టారు. ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా శ్రావణ్‌కుమార్ కు అమ్మపై ఉన్న ప్రేమని, గుడి నిర్మాణం కోసం తీసుకుంటున్న శ్రద్ధను స్థానికులు, పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమ్మ ప్రేమకు మా సలామ్ అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..