Andhra Pradesh: గర్భిణులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సేవలు కూడా ఉచితం

గర్భిణులకు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ (టిఫా) స్కానింగ్‌ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు. సాధారణంగా ఈ టీఫా స్కాన్‌ను...

Andhra Pradesh: గర్భిణులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సేవలు కూడా ఉచితం
Andhra Pradesh
Follow us
Narender Vaitla

|

Updated on: May 14, 2023 | 8:29 AM

గర్భిణులకు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ (టిఫా) స్కానింగ్‌ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు. సాధారణంగా ఈ టీఫా స్కాన్‌ను తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక్కో టిఫా స్కాన్‌కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

గర్భం ధరించిన 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌లు చేస్తారు. గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌ చేయడానికి వీలుగా వివరాలను ఆన్‌లైన్‌లో పొందిపరిచామని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్ హరేంధిరప్రసాద్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలనే విషయంపై నెట్‌వర్క్‌ ఆసుపత్రుల మెడికోలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..