Pond Water: సాగు కోసం చెరువులో నీళ్లు పొలాలకు పెట్టినందుకు పోలీసులకు ఫిర్యాదు.. రైతన్నల ఆగ్రహం
గుంటూరు జిల్లాలో సాగు నీటి కష్టాలు తీరడం లేదు. ఏదో ఒక విధంగా పంటలను కాపాడుకునేందుకు రైతులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. అయితే చెరువు నీళ్లను వాడుకున్నారని అన్నదాతలపై పంచాయితీ ఈవో ఫిర్యాదు చేడయం కలకలం రేపింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పొలాలు సాగర్ కుడి కాలువ ఆయకట్టులో టెయిల్ ఎండ్ భూములుగా ఉన్నాయి. దీంతో సాగర్ సాగు నీరు ఈ ఏడాది రాలేదు. మరోవైపు వర్షాలు కూడా తక్కువుగా ఉన్నాయి. పంటలు..
గుంటూరు, అక్టోబర్ 29: గుంటూరు జిల్లాలో సాగు నీటి కష్టాలు తీరడం లేదు. ఏదో ఒక విధంగా పంటలను కాపాడుకునేందుకు రైతులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. అయితే చెరువు నీళ్లను వాడుకున్నారని అన్నదాతలపై పంచాయితీ ఈవో ఫిర్యాదు చేడయం కలకలం రేపింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పొలాలు సాగర్ కుడి కాలువ ఆయకట్టులో టెయిల్ ఎండ్ భూములుగా ఉన్నాయి. దీంతో సాగర్ సాగు నీరు ఈ ఏడాది రాలేదు. మరోవైపు వర్షాలు కూడా తక్కువుగా ఉన్నాయి. పంటలు బెట్ట తీయడంతో రైతులు పంటలను కాపాడుకునేందకు బోరు బావులు, చెరువుల నీటిని వినియోగించుకుంటున్నారు. అయితే చెరువు నీటిని సాగు నీరుగా వినియోగించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో మిర్చి, ప్రత్తి రైతులు సాగు చేశారు. గత నెల రోజుల నుండి వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్తిపాడు రైతులు గొట్టిపాడు చెరువు నీళ్లను సాగు నీటి కోసం వినియోగించుకుంటున్నారు. ఇంజన్ల ద్వారా చెరువు నీటిని పంట పొలాలకు మళ్లించారు. దీనిపై పంచాయితీ అధికారులు స్పందించారు. చెరువు నీటిని పొలాలకు పెట్టుకోనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా చెరువు నీటిని పొలాలకు మళ్ళించిన రైతులపై ప్రత్తిపాడు పోలీసుకు ఫిర్యాదు చేశారు. పంచాయితీ ఈవో జాన్ పీరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్ పీరా ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చెరువు నీటితో సాగు చేస్తున్న రైతులు టిడిపికి మద్దతిచ్చే వారు కావడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతున్నలు చెరువు నీటిని సాగునీరుగా వాడుకున్నారన్న ఆరోపణలపై ఫిర్యాదు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా ఈవో తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాగునీటి చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్న సమయంలో ఈ వివాదం ఏ వైపు మళ్ళుతుందోనని రైతులు భయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.