Andhra News: పాపం.. అడవి నుంచి నీళ్ల కోసం అని వస్తే.. గుండె తరుక్కుపోయే దృశ్యం
మనం సోషల్ మీడియాలో ఎన్నో సంఘటనలకు సంబంధించిన వార్తలను చూస్తూ ఉంటాం. అందులో కొన్ని వార్తలను చూసి ఆవేదనకు గురవుతూ ఉంటాం. అలాంటి ఘటనే ఒక్కటి ఒంగోలులో జరిగింది. ఈ మధ్య కొన్ని అడవి జంతువులు అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. అలా వచ్చి తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నాయి.
ఇటీవల కాలంలో అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వన్యప్రాణులు ఎక్కువగా వస్తున్నాయి. దారి తప్పడమో లేక వేటగాళ్ల నుంచి తప్పించుకొనో గ్రామాల్లోకి, రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో వాటి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే ఒంగోలు బైపాస్ రోడ్డుపై జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ జింక రోడ్డుపై పరిగెడుతూ బైక్‌ను ఢీ కొట్టి కాలువలో పడిపోయింది. జింకను బయటకు తీసేందుకు స్థానికులు విశ్వ ప్రయత్నం చేసి వీలు కాకపోవడంతో చివరకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డుపై పరిగెడుతూ బైక్‌ను జింక ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బిత్తర పోయిన జింక పక్కనే ఉన్న పెద్ద సైడు కాలువలోకి దూకింది. కాలువ పెద్దదిగా ఉండటంతో బయటకు రాలేక జింక ఇబ్బందులు పడింది. జింకను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది జింకను పట్టుకొని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఒంగోలు ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. జింకను సురక్షితంగా తీసుకువెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి