Andhra News: వావ్ వాటే ఐడియా.. కొడుకు ఆడుకోవడానికి తండ్రి చేసిన పని చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
అంబాజీపేటలో బుల్లి పొట్టేలు బండి అబ్బురపరుస్తుంది. తన పిల్లలు ఆడుకోవడానికి పురాతన కాలం నాటి చిన్ని పొట్టేలు బండిని ఓ తండ్రి తయారు చేశారు. అది ప్రజలను ఎంతోగాను ఆకట్టుకుంది. పిల్లలను ఎక్కించుకుని తిరుగుతూ అబ్బుర పరుస్తున్న పొట్టేలు బండిని సొంతంగా తయారు చేసానని తనకు పశువులంటే ఇష్టమని ఆ తండ్రి తెలిపాడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో బుల్లి పొట్టేళ్ల బండి అందరినీ అబ్బుర పరుస్తుంది. అంబాజీపేట కొర్లపాటి పాలెంలో ఎర్రంశెట్టి శ్రీను తాను పెంచుకుంటున్న పొట్టేలు పిల్లకు ఒక బుల్లి బండి తయారుచేశారు. తన పిల్లలకు అడుగు ఎత్తున ఉన్న బుల్లి బండి తయారు చేశారు. పొట్టేళ్లతో బండి తయారుచేసి పిల్లలను తిప్పుతున్నాడు. పిల్లలను ఎక్కించుకుని తిరుగుతూ అబ్బుర పరుస్తున్న పొట్టేలు బండిని సొంతంగా తయారు చేసానని తనకు పశువులంటే ఇష్టమని అందులో భాగంగానే పొట్టేలును పెంచి ఒక చిన్న పొట్టేలుకు సరిపడే బండి తయారు చేసి తన పిల్లలను ఆదివారం పూట సరదాగా బండిపై తిప్పుతున్నానని శ్రీను చెబుతున్నాడు. గతంలో పొట్టేలు బండ్లు ఉండేవని ఇప్పుడు ఇవి లేవని తాను సరదాగా తయారు చేసానని ఆయన తెలిపాడు. ఈ బండిపై పిల్లలను తిప్పుతుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని పేర్కొంటున్నాడు. ఈ పొట్టేలు బండిని జనం వింతగా చూస్తున్నారు. ఎడ్ల బళ్ళు, గుర్రపు బండ్లు చూసిన ప్రజానీకం ,ఇప్పుడు కొత్తగా పొట్టేలు బండి చూస్తూ అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.పెద్దతరం వారు నేటి యువతరానికి పూర్వం ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లుతో ప్రయాణాలు చేసే విధానాన్ని తెలియచేస్తున్నారు .ఆధునిక యుగంలో అబ్బురపర్చిన ఈ పొట్టేలు బండి అంబాజీపేటలో అందరినీ ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి