Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: రోశయ్య విగ్రహం చుట్టూ గుంటూరు జిల్లా రాజకీయాలు.. పోటాపోటీగా విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనలు..

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం చుట్టూ గుంటూరు రాజకీయాలు తిరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వేమూరు రోశయ్య సొంత ఊరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా,

Guntur: రోశయ్య విగ్రహం చుట్టూ గుంటూరు జిల్లా రాజకీయాలు.. పోటాపోటీగా విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనలు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2021 | 4:36 PM

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం చుట్టూ గుంటూరు రాజకీయాలు తిరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వేమూరు రోశయ్య సొంత ఊరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్యకు జిల్లాతో విస్తృతమైన అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలంటూ అన్ని పార్టీల నేతలు, ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని ఆయన సంస్మరణ సభలో హోంమంత్రి సుచరిత రచయితలను కోరారు. మరోవైపు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒకడగు ముందుకేసి గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రభుత్వమే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో తామే ఏర్పాటు చేస్తామన్నారు. పిడుగురాళ్లలో రోశయ్య సామాజిక వర్గానికి బాగా పట్టుంది. ప్రభుత్వం పట్టించుకోకుంటే రోశయ్య విగ్రహం తామే ఏర్పాటు చేసి అటు పిడుగురాళ్లతో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా రోశయ్య సామాజిక వర్గ ఓటర్లపై ప్రభావం చూపించవచ్చన్న ఆలోచన చేసింది.

ఈక్రమంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి టీడీపీ ఎత్తుగడను పసిగట్టి ధీటుగానే స్పందించారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన కొత్త చిన సుబ్బారావు ఛైర్మన్ గా ఉన్నారు. వెంటనే రోశయ్య విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ లో తీర్మానం చేయించారు. మరోవైపు తమ సామాజిక వర్గం నుంచే మొదటి విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ పట్టణ ప్రముఖులు ముందుకొచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డు మొదట్లో విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేయించారు. నెల రోజుల వ్యవధిలోనే విగ్రహాం ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. కౌన్సిల్ నుంచి తీర్మానం చేయించడం, వారి సామాజిక వర్గం నుంచే విగ్రహం ఏర్పాటు చేయిస్తుండటంతో టీడీపీకి ధీటుగా సమాధానం ఇచ్చినట్లైందని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అనుకుంటున్నారు. కేవలం గురజాలలోనే కాదు గుంటూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో కూడా రోశయ్య విగ్రహం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. Also Read:

Watch Video: ఇదేంటి గోవిందా.. వెళ్లింది భక్తితో.. చేసింది గోల.. బస్సులో సీటు కోసం కొట్టుకున్న భక్తులు..

Lance Naik Sai Teja: తెలుగు అమర జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా… ఇరు రాష్ట్రాల సీఎంలపై వీహెచ్ తీవ్ర విమర్శలు..

Skill Development Case: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఊరట.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ముందస్తు బెయిల్..